Trends

ఏపీలో మళ్లీ కరోనా కలకలం…?

యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే… ఇతర ప్రాంతాల గురించి అటుంచితే… ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే భావన వ్యక్తమవుతోంది. మునుపటి మాదిరిగా వందలు, వేల సంఖ్యలో కరోనా కేసులు లేకున్నా… అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు వెలువడే స్థాయిలో మాత్రం కొత్త కేసులు నమోదయ్యాయి. గత నెల 26 నుంచి గురువారం వరకు నమోదు అయిన కేసుల వివరాలే ఈ తరహా అప్రమత్తతను చాటి చెబుతున్నాయి. 

దాదాపుగా రెండేళ్లకు పైబడి కరోనా విశ్వవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. వేలు దాటి లక్షల సంఖ్యలో జనం ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇతర దేశాల మాదిరే భారత్ లోనూ ఈ వైరస్ పెను ప్రకంపనలే సృష్టించింది. అయితే గడచిన నాలుగేళ్లుగా పెద్దగా కేసులు లేకున్నా… అడపాదడపా అక్కడొకటి, ఇక్కడొకటి అన్నచందంగా అప్పుడప్పుడే కరోనా కేసులు నమోదు అయినా పెద్ద ప్రమాదమేమీ లేదనే చెప్పాలి. అయితే కరోనా వైరస్ ను ఈజీగా పరిగణించరాదన్న రీతిలో ఏపీటో ఇప్పుడు వరుసగా కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా నలుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఏపీలో గడచిన 20 రోజుల వ్యవధిలో ఏకంగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అత్యధికం కడప జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. ఒక్క కడప జిల్లాలోనే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు జిల్లాలో రెండు, విశాఖ, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.

కరోనా సోకిన 12 మందిలో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా… ముగ్గురు కోలుకున్నారు. ఇక మిగిలిన వారిలో ముగ్గురు హోం ఐపోలేషన్ లో ఉండగా… ఇద్దరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

This post was last modified on July 16, 2026 11:16 pm

Share

Recent Posts

ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం తీర్చాల్సిందే

ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…

5 minutes ago

రోడ్డుపై పడుకొని ప్రియాంకా గాంధీ నిరసన

ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…

28 minutes ago

ఫుట్ పాత్ లపై ట్రాన్స్ ఫార్మర్లేంది స్వామీ?

మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…

57 minutes ago

రేవంత్ ఫాంహౌస్ పాచిక పెద్దదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…

1 hour ago

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

2 hours ago

రంగస్థలం కాంబో… అసలు టార్గెట్ ఏంటి

పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…

3 hours ago