దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ సినిమాల డబ్బింగ్ వెర్షన్ల కోసం ఇక్కడికి వచ్చే కోలీవుడ్ ప్రముఖులందరూ ఈ మాటే అంటుంటారు. కానీ మనం ఇక్కడ తమిళ సినిమాలను నెత్తిన పెట్టుకుంటుంటే.. మన సినిమాలను మాత్రం వాళ్లు పట్టించుకోరు.
బాహుబలి, పుష్ప లాంటి ఒకటీ అరా సినిమాలు మినహాయిస్తే తమిళనాట తెలుగు సినిమాలు ఆడవు. బాహుబలికి ముందు రాజమౌళి నుంచి వచ్చిన మగధీర, ఈగ చిత్రాలకు కూడా తమిళంలో పెద్దగా ఆదరణ దక్కలేదు. దీని గురించి యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తరచుగా ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు. మన సినిమాలకు తమిళనాట అసలు థియేటర్లే ఇవ్వకపోవడంపై గతంలో అతను స్టేజ్ మీద, ఇంటర్వ్యూల్లో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా తన కొత్త చిత్రం చెన్నై లవ్ స్టోరీ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్న అతను.. ఇదే టాపిక్ మీద మాట్లాడాడు. సూర్య సినిమా కరుప్పుకి తెలుగులో కావాల్సినన్ని థియేటర్లు దొరికాయని, ఆ చిత్రం తెలుగులో బాగా ఆడిందని.. కానీ అఖిల్ సినిమా లెనిన్‌కు తమిళనాట థియేటర్లు ఇచ్చి అది బాగా ఆడితే, అతడికి మార్కెట్ పెరుగుతుంది కదా అని కిరణ్ అన్నాడు. మనం ఇతర భాషా చిత్రాలను ఇలా నెత్తిన పెట్టుకుంటుంటే.. మన సినిమాలకు మాత్రం ఇతర రాష్ట్రాల్లో సరిపడా థియేటర్లు ఇవ్వకపోడం ఏంటని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదే విషయమై ఒక తమిళ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తన బాధ చెప్పుకుంటే.. తాము కావాలంటే తెలుగు సినిమాలకు థియేటర్లు ఇస్తామని.. కానీ తమిళ జనాలు థియేటర్లకు వచ్చి తెలుగు డబ్బింగ్ సినిమాలు చూడరని ఖరాఖండిగా చెప్పేశాడని.. ఆయన అంత ఓపెన్‌గా ఆ స్టేట్మెంట్ ఇచ్చాక మనం ఇక ఏం మాట్లాడతామని కిరణ్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on July 17, 2026 6:47 am
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…
ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…
మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…