Political News

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచిన ముద్రగడ… రెండు పర్యాయాలు మంత్రిగా కూడా కొనసాగారు. అనారోగ్యంతో ముద్రగడ మరణించారు గానీ… ఇంకొంతకాలం ఆయన బతికి ఉంటే గవర్నర్ పదవిని కూడా చేపట్టేవారే. నిజమా? అంటే… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారట. కాపు ఉద్యమాలతోనే సహజీవనం చేసిన ముద్రగడకు గవర్నర్ పదవి వచ్చి ఉంటే నిజంగానే… ఆ సామాజిక వర్గానికి ఓ గుర్తింపు దక్కేదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా ముద్రగడ వైసీపీలో చేరిపోయారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాస్తంత విశ్రాంతి తీసుకున్న ముద్రగడ అప్పటిదాకా ఏ పార్టీ పక్షమూ వహించని సంగతి తెలిసిదే. అయినా కూడా ఆయన కాపు ఉద్యమమే నేపథ్యంగా సాగారు. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్… ముద్రగడకు గవర్నర్ పదవిని ఇచ్చే విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో జనసేన జట్టు కట్టిన కూటమి ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని చెప్పిన పవన్… ఆ తర్వాత ముద్రగడకు గవర్నర్ పదవిని ఇద్దామంటూ ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ఇప్పుడు తాజాగా జనసేన పీఏసీ చైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు.

కృష్ణా జిల్లా కైకలూరులో జనసేన చర్చావేదిక పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. పార్టీకి చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల సమస్యలు, వాటి పరిష్కారంపై దృష్టి సారించేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా నాదెండ్ల… ముద్రగడ అంశాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీలతో జనసేన జట్టు కట్టి కూటమిగా ఏర్పడిన నాటి సంగతులను ఈ సందర్భంగా నాదెండ్ల ప్రస్తావించారు. అప్పటికి ముద్రగడ ఇంకా వైసీపీలో చేరలేదు. జనసేన తరఫున ఆయా కీలక నేతలతో చర్చలు జరపాలని, వారందరి సహకారంతోనే ఎన్నికలకు వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్దేశించుకున్నట్లుగా నాదెండ్ల చెప్పుకొచ్చారు.

అందులో భాగంగానే కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభంతోనూ చర్చలు జరపాలని పవన్ తీర్మానం చేశారని నాదెండ్ల తెలిపారు. జనసేన సిద్ధాంతాలతో ముద్రగడ కూడా కలిసి వస్తారన్న ఆశాభావాన్ని నాడు పవన్ వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని, ఆ తర్వాత ముద్రగడకు జనసేన తరఫున గవర్నర్ పదవిని ఆఫర్ చేద్దామని పవన్ అన్నారని తెలిపారు. ముద్రగడ మరణం నేపథ్యంలో ఆయనను, రాజకీయాల్లో ఆయన ప్రస్థానం, కాపు ఉద్యమంలో ఆయన నెరపిన వ్యూహాలను గుర్తు చేసుకున్న సందర్భంగా నాదెండ్ల ఈ మాటలను మరోమారు గుర్తు చేయడం గమనార్హం.

Kumar

Recent Posts

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

2 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

3 hours ago

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన…

3 hours ago

నోలన్ విధ్వంసానికి ఆకాశమే హద్దు

ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…

3 hours ago

ప్రభాస్ పోస్టర్ ఏం చెబుతోంది

అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…

4 hours ago

వారణాసికి ఐమాక్స్ తెరల సమస్య

ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…

5 hours ago