ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గందరగోళానికి గురయ్యాయి. AI171 పేరిట ప్రయాణించిన ఈ విమానంలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించడమే కాకుండా, పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది. 242 మంది ప్రయాణికులు మరణించినట్టు తెలిసిన వెంటనే మార్కెట్ నెగటివ్ ట్రెండ్‌లోకి వెళ్లింది. టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే విమానం కుప్పకూలిన వార్తలు పంజా విసురుతుండగా, మదుపరులు డీల్ చేయడంలో వెనుకంజ వేశారు.
అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతుండగా, విమాన ప్రమాదం తలనొప్పిని రెట్టింపు చేసింది. ఇజ్రాయెల్ సైనిక దళాలు ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడికి పాల్పడిన విషయం, అంతేగాక హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రతీకార చర్యలు తీసుకోవచ్చన్న అనుమానాలు మార్కెట్ వాతావరణాన్ని మరింత ఉద్విగ్నంగా మారేశాయి. చమురు ధరలు ఒక్కసారిగా 12 శాతం పెరగడంతో, ఆయిల్ ఆధారిత రంగాల్లో నష్టాలు ఎక్కువయ్యాయి.
నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 గంటల సమయంలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు క్షీణించి 80,570 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ సైతం 330 పాయింట్ల నష్టంతో 24,553 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించింది. బ్రాడర్ మార్కెట్లు, మిడ్ కాప్, స్మాల్ కాప్ సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఏవియేషన్, టూరిజం, ఆయిల్ కన్స్యూమింగ్ రంగాల్లో గణనీయమైన నష్టాలు నమోదయ్యాయి.
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. బోయింగ్ షేర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 5 శాతం పడిపోవడం గమనార్హం. బోయింగ్ కంపెనీకి చెందిన డ్రీమ్‌లైనర్ వాహనం ఇంత ఘోర ప్రమాదానికి గురి కావడం, కంపెనీ పరంగా మాత్రమే కాదు, ఏవియేషన్ పరిశ్రమపైనా ఒత్తిడిని పెంచే అంశం. ఒక్కసారిగా చెడు వార్తలు వరుసగా రావడం వల్ల పెట్టుబడిదారులు గందరగోళానికి గురవుతున్నారు.
ఈ మూడే సెంటిమెంటును గట్టిగా దెబ్బతీసింది. వచ్చే రోజుల్లో మార్కెట్ రికవరీగా మారాలంటే, ఆంతర్య రాజకీయాలు శాంతించాల్సిన అవసరం ఉంది. నిఫ్టీ 24,500 స్థాయి వద్ద మద్దతు కనిపించవచ్చు. అప్పటిదాకా ఎవరూ పెద్దగా రిస్క్ తీసుకోరని అని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విమాన ప్రమాదం, చమురు ధరలు, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు అన్నీ కలసి దేశీయ మార్కెట్లపై భయానక ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని నుంచి పూర్తిస్థాయి రికవరీకి సమయం పడే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు.
This post was last modified on June 13, 2025 2:07 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…