త్వరలో.. షర్మిల రంగంలోకి దిగుతారట

త్వరలో.. షర్మిల రంగంలోకి దిగుతారట

సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలకు కాస్త ఎడంగా ఉంటున్న జగన్‌ బాణం షర్మిల త్వరలో తెలంగాణలో కాలు మోపనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాల్ని  పైనుంచి పర్యవేక్షిస్తారంటూ ఆ మధ్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ పేర్కొనటం తెలిసిందే.

తాజాగా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల ఆత్మహత్యలపై చర్చించిన పార్టీ నేతలు.. రైతులకు పరిహారం సకాలంలో అంది ఉంటే.. ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్ని తిరిగి బతికించగలమా అంటూ ప్రశ్నించిన ఆయన.. ఎండిన ప్రతి ఎకరానికి రూ.25వేలు చెల్లించాలన్నారు.

తెలంగాణలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతిఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందని చెప్పారు. త్వరలో షర్మిల తెలంగాణలో పర్యటిస్తారని.. పరామర్శ యాత్ర చేపడతారన్నారు. 350కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాక కానీ.. తెలంగాణ వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ నేతలకు తెలంగాణ అన్నదాతల అవస్థల గురించి గుర్తుకు రాలేదు.

ఇప్పటికైనా వారు గుర్తు వచ్చిందనందుకు సంతోషపడాలా? ఇంత కాలం ఎందుకు గుర్తుకు రాలేదని బాధ పడాలా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు