కేసీఆర్ త‌ర‌హాలోనే మోదీకి చంద్ర‌బాబు చెక్!

కేసీఆర్ త‌ర‌హాలోనే మోదీకి చంద్ర‌బాబు చెక్!

కేంద్రంలో కాంగ్రెస్ తో టీడీపీ జ‌త‌క‌ట్ట‌డంపై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. జాతీయ స్థాయిలో, తెలంగాణ‌లతో పాటు ఏపీలో కూడా కాంగ్రెస్ తో పొత్తు ఉంద‌ని...కొంద‌రు టీడీపీపై బుర‌ద‌జ‌ల్లుతున్నారు. అయితే, ఏపీలో మాత్రం కాంగ్రెస్ తో క‌లిసే ప్ర‌స‌క్తే లేద‌ని ఇప్పటికే ప‌లువురు టీడీపీ నేత‌లు క్లారిటీ ఇచ్చారు.

ఇక‌, కాంగ్రెస్ తో క‌ల‌యిక వ్య‌వ‌హారంలో ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ప‌క్కా క్లారిటీతో ఉన్నార‌ట‌. ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు లేద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని చంద్ర‌బాబు సూచించార‌ని తెలుస్తోంది. బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్న విష‌యం...ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాల‌ని పార్టీ స‌మావేశాల్లో కూడా చెబుతున్నార‌ని తెలుస్తోంది.

ప్రాంతీయ పార్టీల కూటమి క‌న్నా...కాంగ్రెస్ తో క‌లిసి ఏర్ప‌డే కూట‌మి బ‌లంగా ఉంటుంద‌న్న కార‌ణంతోనే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తిచ్చిన విష‌యం ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని చెబుతున్నార‌ట‌.

ఇక, పొరుగు రాష్ట్రం తెలంగాణలో బ‌లంగా ఉన్న‌ కేసీఆర్ కు జ‌వాబిచ్చే దీటైన నాయ‌కులు లేరు. మ‌హాకూట‌మి ఏర్ప‌డ్డ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డింది. కేసీఆర్ కు దీటుగా బ‌దులివ్వ‌గ‌లిగిన నాయ‌కుడు చంద్ర‌బాబేనని టీడీపీ కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు.

మ‌హాకూట‌మి ఏర్ప‌డ‌డంతో... టీఆర్ ఎస్ డిఫెన్స్ లో ప‌డింది. దీంతో, జాతీయ స్థాయిలో కూడా మ‌హాకూట‌మి...మోదీ కోట‌ను బ‌ద్ద‌లు కొడుతుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.  చంద్ర‌బాబు జాతీయ స్థాయిలో యూపీఏకు మ‌ద్ద‌తిచ్చిన నేప‌థ్యంలో...విప‌క్షాల‌కు కొత్త‌బ‌లం వ‌చ్చిన‌ట్ల‌యింది.

అందుకే, ముందుగా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవ‌ర‌నే ప్ర‌శ్న రాకుండా....మోదీని ఎదుర్కొనేందుకు విప‌క్షాలు ఏక‌తాటిపైకి వ‌చ్చాయ‌న్న సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళుతున్నారు. ఈ విధంగా తెలంగాణ‌లో కేసీఆర్....కేంద్రంలో మోదీని ఏక‌కాలంలో దెబ్బ‌కొట్టేందుకు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English