ఫేస్‌బుక్ సీఈవో పదవి నుంచి జుకర్‌బర్గ్‌కు ఊస్టింగ్?

ఫేస్‌బుక్ సీఈవో పదవి నుంచి జుకర్‌బర్గ్‌కు ఊస్టింగ్?

డొనాల్డ్ ట్రంప్ తెలియనవారు ఉండొచ్చు... కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎన్నడూ విననివారూ ఉండొచ్చు.. అంతెందుకు నరేంద్ర మోదీ ఎవరంటే బిక్క మొహం వేసేవారూ ఉంటారు.. దీపికా పదుకునే, ఇవాంకా ట్రంప్, జెన్నిఫర్ లోపెజ్ వంటి సుందరాంగుల సంగతులూ తెలియకపోవచ్చు... ఇంకా చెప్పాలంటే సన్నీ లియోన్ షోకు చూడని సత్పౌరులూ ఈ ప్రపంచాన ఇంకా మిగిలి ఉండొచ్చు.

.....కానీ, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ఏ ఒక్కడికీ మార్క్ జుకర్‌బర్గ్ అనేవాడు తెలియకుండా ఉండడు. తమ స్మార్టుఫోన్లలో సర్రుసర్రున ఫేస్‌బుక్ హోం పేజీలను, వాల్స్‌నూ స్క్రోల్ చేస్తుంటే వారానికోసారైనా ఎక్కడో ఒక చోట తగిలే క్యాండిడేట్ ఈయన. ముఖం తెలియనివారికి పేరు తెలియకపోవచ్చు.. పేరు విన్నా ముఖం తెలియనివారు ఉండొచ్చు.. కానీ, మొత్తానికి జుకర్ బర్గ్‌ చిత్రం చూడడమో, పేరు వినడమో అందరికీ అనుభవమే. దీనంతటికీ కారణం ఆయన సృష్టించిన ఫేస్ బుక్.. కానీ, ఇప్పుడా ఫేస్ బుక్ నుంచి ఆయన్ను బయటకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయట.

ఫేక్ న్యూస్, డాటా బ్రీచింగ్ వంటివి  ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పదవికి ఎసరు తెస్తున్నాయి. ఫేస్ బుక్ ఐఎన్సీలో మెజారిటీ షేర్లను కలిగున్న నాలుగు యూఎస్ ఫబ్లిక్ ఫండ్ సంస్థలు తొలిసారిగా ఆయన్ను తొలగించాల్సిందేనన్న ప్రతిపాదన చేశాయి. ఇక సంస్థ అసెట్ మేనేజర్లు కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చేస్తే, మార్క్ తొలగింపు తప్పదు. ఇల్లినాయిస్‌‌, రోడ్ ఐలండ్, పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్‌ ట్రెజర్స్, న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ ఫండ్స్ సంస్థలు మార్క్ ను తీసివేయాలని, ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని డిమాండ్ చేశాయి. డేటా తస్కరణ, కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం నుంచి సంస్థను బయటపడేయాలంటే, మార్క్ జుకర్ బర్గ్ ను తప్పించడమే ఉత్తమమని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్స్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. వచ్చే వార్షిక సమావేశంలో దీనిపై చర్చిస్తామని సంస్థ చీఫ్ సేథ్ మాగజైనర్ వ్యాఖ్యానించారు. కాగా, ఫేస్ బుక్ తదుపరి సర్వసభ్య సమావేశం 2019 మేలో జరుగనుంది. అయితే, జుకర్ బర్గ్ కు 60 శాతం ఓటింగ్ హక్కు ఉండటంతో ఆయన తొలగింపు అంత సులువేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో అత్యధిక మార్కెట్ వాటాను కలిగివున్న ఫేస్ బుక్ ఈక్విటీ ఈ వార్తలతో 10 శాతం పడిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English