మళ్లీ గుజరాత్‌లో అల్లర్లు

మళ్లీ గుజరాత్‌లో అల్లర్లు

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. అయితే, ఈసారి మతపరమైన అల్లర్లు కాకుండా రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రగులుకున్నాయి. దీంతో  ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీని వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందన్న వాదన వినిపిస్తోంది.

ఓ గుజరాతీ అమ్మాయి(14)పై అత్యాచారం కేసులో బిహార్ నుంచి వలసవచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వలసవచ్చిన కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. సోషల్ మీడియాలో కొందరు విద్వేష పూరిత పోస్టులు చేయడంతో గాంధీనగర్, అహ్మదాబాద్, పటన్, సబర్‌కాంతా, మెహసానా ప్రాంతాల్లో వలసవచ్చిన వారిపై అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి.

దీంతో ప్రాణాలను అరచేత పట్టుకుని పలువురు సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. అహ్మదాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని సబర్‌కాంతా జిల్లా హిమ్మత్‌నగర్ టౌన్‌లో సెప్టెంబర్ 28న ఓ బాలిక(14)పై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ బిహార్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గుజరాతీ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

ఠాకూర్ సేన అనే సంస్థ బిహార్, యూపీ ప్రజలు వెంటనే గుజరాత్ ను వదిలి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఆ రాష్ట్రాల వారికి పని ఇవ్వరాదని దుకాణాల యజమానులకు అల్టిమేటం జారీచేసింది. దీంతో వందలాది మంది ప్రజలు ప్రాణ భయంతో తమ సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు.  అత్యాచార ఘటన వాస్తవమైనప్పటికీ... అనంతరం దాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ శక్తులు విద్వేషాలు రగిలిస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English