కవితకు అరుదైన గౌరవం

కవితకు అరుదైన గౌరవం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవితకు అరుదైన గౌరవం దక్కింది. కవిత బతుకమ్మ ఎత్తుకున్న ఫోటోతో విదేశాల్లో పోస్టల్ స్టాంపులు రిలీజయ్యాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఈ మేరకు కవిత స్టాంపులు అచ్చేశాయి. దీంతో కవిత రేర్ ఫీట్ సాధించినట్లైంది.
    
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మకు కవిత ఓ రకంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఉద్యమ సమయం నుంచి ఇప్పటికీ బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అన్నంతగా ప్రచారం చేశారు. వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా బతుకమ్మలు ఆడారు.
       
కవిత ఒక్కరితో మొదలైన తెలంగాణ జాగృతి.. ఇప్పుడు దేశవిదేశాల్లో విస్తరించింది. ప్రతి దేశంలో తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా జాగృతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కవిత కృషికి గుర్తింపుగా ఆమె పోస్టల్ స్టాంపులు విడుదల చేయాలని ప్రవాస టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆసీస్, కివీస్ ప్రభుత్వాల్ని కోరారు.
     
ఆయన విజ్ఞప్తి మేరకు కవిత బతుకమ్మ ఎత్తుకున్న ఫోటోతో న్యూజిలాండ్ ను స్టాంప్ ను రిలీజ్ చేయగా.. కవిత ఫోటో ముఖచిత్రంగా ఆస్ట్రేలియా స్టాంప్ ముద్రించింది. కవిత స్టాంపులు విదేశాల్లో రిలీజవ్వడంతో.. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు