ఏపీలో అప్ప‌టికి కాంగ్రెస్ కోలుకుంటుందా?

ఏపీలో అప్ప‌టికి కాంగ్రెస్ కోలుకుంటుందా?

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంద‌న్న విష‌యం తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక్క అసెంబ్లీ సీటును ద‌క్కించుకోవ‌టం త‌ర్వాత‌.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కాంగ్రెస్ అభ్య‌ర్థులు సైతం డిపాజిట్టు సాధించ‌లేని దుస్థితి.

ఏపీలో దాదాపుగా అడ్ర‌స్ లేకుండా పోయిన కాంగ్రెస్‌.. ఏపీలో ఏదో ఒక అంశాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చి నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే.. కాంగ్రెస్‌ను ఏ మాత్రం న‌మ్మే ప‌రిస్థితి లేక‌పోగా.. వారు చేస్తున్న‌ ప్ర‌య‌త్నాల‌కు సీమాంధ్రుల నుంచి ఎలాంటి సానుకూల స్పంద‌న ల‌భించ‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే. .తెలంగాణ‌రాష్ట్రంలో ఏపీ ముఖ్య‌మంత్రికి సంబంధించిన ఆడియో టేపు ఒక‌టి రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓటును నోటు వ్య‌వ‌హారంలో టీఆర్ ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ తో మాట్లాడిన‌ట్లుగా చెబుతున్న టేపు వ్య‌వ‌హారంపై ఏపీ కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై.. ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

కాంగ్రెస్ పార్టీ చ‌చ్చిన శవం లాంటిద‌ని మంత్రి రావెల కిషోర్‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డితే.. కాంగ్రెస్ ను కాపాడ‌టం ఎవ‌రి త‌రం కాద‌ని వ్యాఖ్యానించారు. మ‌రోమంత్రి ప‌త్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభ‌జ‌న పాపం క‌నీసం న‌ల‌భైఏళ్లు కాంగ్రెస్‌ను వెంటాడుతుంద‌ని.. అప్ప‌టివ‌ర‌కూ ఆ పార్టీ కోలుకోలేద‌ని తేల్చేశారు. మొత్తానికి పాతాళంలోకి తొక్కేశార‌ని చెప్పే త‌మ అధినేత చంద్ర‌బాబు మాట‌కు భిన్నంగా.. న‌ల‌భైఏళ్ల‌లో కాంగ్రెస్ కోలుకుంటుంద‌ని మంత్రి ప‌త్తిపాటి చెప్ప‌టం కాస్తంత విశేష‌మే.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు