ప్రభాస్‌ భయపడ్డట్టే అయింది!

ప్రభాస్‌ భయపడ్డట్టే అయింది!

    ప్రభాస్‌ గురించి, వైఎస్‌ షర్మిల గురించి కొంత కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. సోషల్‌ నెట్‌వర్క్‌లో అయితే ఈ పుకార్లపై చాలా జోకులు కూడా పుట్టించారు. అయితే ఈ విషయం ఇంతకాలం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ దాటి పెద్దగా ప్రచారం పొందలేదు. కానీ ఇప్పుడు షర్మిల ఈ పుకార్లు పుట్టించిన వారిపై కేసు పెట్టడంతో ఈ విషయం పెద్దదైంది. ఇంతకాలం ఇది తెలియని వారికి కూడా ఇప్పుడు దీని గురించి తెలిసింది. ఈ పుకార్లు మొదలైన దగ్గర్నుంచి... ఇది రచ్చ కాకూడదని సైలెంట్‌గా ఉన్న ప్రభాస్‌ భయం నిజమై ఇప్పుడు ఇది పెద్ద టాపిక్‌ అయి కూర్చుంది.

 కేసు కూడా పెట్టేసరికి మీడియా ఇప్పుడీ రూమర్‌ గురించి ఓపెన్‌గా డిస్కస్‌ చేసేస్తోంది. తనకి ఈ పుకార్ల కారణంగా ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్‌ ఉంటుంది కాబట్టి, తన గురించి పుకార్లపై కేస్‌ కూడా అయింది కాబట్టి ప్రభాస్‌ ఇప్పుడు స్పందించక తప్పని పరిస్థితి. కానీ దీని గురించి ఎలా రియాక్ట్‌ అవ్వాలో తెలియక ప్రభాస్‌ తల పట్టుకున్నాడట. విచక్షణా రహితంగా ఇలాంటి పుకార్లు పుట్టించే వాళ్ల వల్ల వచ్చే నొప్పులివి. సెలబ్రిటీ కష్టాల్లో ఇలాంటివీ అప్పుడప్పుడూ తప్పవు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు