విజ‌య్‌కి అర్జున్ రెడ్డి చేసిన న‌ష్టం

విజ‌య్‌కి అర్జున్ రెడ్డి చేసిన న‌ష్టం

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అర్జున్ రెడ్డి చేసిన న‌ష్ట‌మా? పెద్ద‌గా పేరు లేని చిన్న హీరోలా ఉన్న విజ‌య్‌లో ఎంత టాలెంట్ ఉందో ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసి.. దేశంలోనే బెస్ట్ పెర్ఫామ‌ర్ల‌లో ఒక‌టిగా నిల‌బెట్టి.. స్టార్ ఇమేజ్, తిరుగులేని క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా అత‌డికి న‌ష్టం చేయ‌డం ఏంటి అనిపిస్తోందా? ఆ సినిమా విజ‌య్‌కి ఎంతో పేరు తెచ్చి పెట్టి కెరీర్‌కు గొప్ప ఊపు ఇచ్చిన మాట వాస్త‌వం. కానీ అదే స‌మ‌యంలో ఆ సినిమా విజ‌య్ మీద‌, అత‌డి కెరీర్ మీద నెగెటివ్ ప్ర‌భావం కూడా చూపిస్తోంది. అర్జున్ రెడ్డి ఎంత ఇంటెన్స్ మూవీనో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప‌ది సినిమాల‌తో స‌మానంగా ఇంపాక్ట్ చూపించిన మూవీ అది. విజ‌య‌చ్ ఏ ప్రేమ‌క‌థ చేసినా.. అందులో ఆటోమేటిగ్గా అర్జున్ రెడ్డి క‌నిపిస్తుండ‌టం ఇప్పుడ‌త‌డికి పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

విజ‌య్ కొంచెం ఆవేశ‌ప‌డ్డా.. గ‌డ్డం పెంచినా.. ప్రేమ తాలూకు బాధ‌ను అనుభ‌వించినా.. అర్జున్ రెడ్డి తెర‌పైకి వ‌చ్చేస్తున్నాడు. జ‌నాల‌కు ఆటోమేటిగ్గా ఆ సినిమా గుర్తుకొస్తోంది. గ‌త ఏడాది వ‌చ్చిన‌ డియ‌ర్ కామ్రేడ్.. తాజాగా రిలీజైన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్... ఈ రెండు సినిమాల్లో ఇదే ఇబ్బంది త‌లెత్తింది. ఇంకా అర్జున్ రెడ్డి హ్యాంగోవ‌ర్ నుంచి విజ‌య్ బ‌య‌టికి రాలేదో ఏమో.. త‌న‌కు తెలియ‌కుండానే ఆ సినిమా మూడ్‌లోకి వెళ్లిపోతున్నాడు. ద‌ర్శ‌కులు కూడా అర్జున్ రెడ్డి ప్ర‌భావంలో ఉండి విజ‌య్‌కి పాత్ర‌లు, స‌న్నివేశాలు రాస్తున్నారేమో అనిపిస్తోంది. మొత్తంగా చూస్తే విజ‌య్ ప్రేమ‌క‌థ‌ల్లోకి అర్జున్ రెడ్డి వ‌ద్ద‌న్నా వ‌చ్చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ఇక‌పై ప్రేమ‌క‌థ‌లు చేయ‌న‌న్న విజ‌య్ స్టేట్మెంట్ స‌రైందే అని.. అత‌ను కాస్త భిన్న‌మైన సినిమాలే చేస్తే బెట‌ర్ అనే ఫీలింగ్ జ‌నాల్లో క‌లుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English