సమంత చాలా చెడ్డ పిల్ల!

సమంత చాలా చెడ్డ పిల్ల!

ఇక ఎంతో కాలం నటిగా కొనసాగడం కుదరదనేది సమంతకి బాగా తెలుసు. నాగచైతన్యతో పెళ్లయిన తర్వాత కూడా నటన కొనసాగిస్తోన్న సమంత ఇక పిల్లల కోసం ప్లానింగ్‌ మొదలు పెడితే ఇప్పట్లో నటించడం కుదరదు. అందుకే నటిగా గుర్తుండిపోయే పాత్రలు చేసి రిటైర్‌ అవ్వాలని చూస్తోంది.

ఓ బేబి అంత పెద్ద హిట్టయిన తర్వాత సమంత ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందులా మామూలు పాత్రలు ఆఫర్‌ చేస్తే తన స్థాయికి అవి తగవని చెప్పేస్తోంది. నటిగా ఎక్స్‌పెరిమెంట్‌ మోడ్‌లో వున్న సమంత ఈ క్రమంలో వెబ్‌ సిరీస్‌లో కూడా నటించడానికి ఓకే అంటోంది. ఇటీవల తొలి సీజన్‌ రిలీజ్‌ కాగా బాగా పాపులర్‌ అయిన 'ది ఫ్యామిలీ మేన్‌' సెకండ్‌ సీజన్‌లో సమంత నటిస్తోంది.

ఇందులో సమంత చాలా నెగెటివ్‌ షేడ్స్‌ వుండే పాత్ర పోషిస్తోందని, ఈ పాత్ర చాలా సర్‌ప్రైజ్‌ చేస్తుందని వినిపిస్తోంది. ఇంతవరకు వెండితెరపై నెగెటివ్‌ పాత్రలు చేయని సమంత ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లో తనలోని మరో కోణాన్ని చూపించనుంది. ఇకపోతే త్వరలోనే చైతన్యతో కలిసి సొంతంగా ఒక నిర్మాణ సంస్థ మొదలు పెట్టి వెబ్‌ సిరీస్‌లతో పాటు చిన్న సినిమాలు కూడా నిర్మించాలనే ఆలోచనలో వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English