విశాల్‌పై వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్

విశాల్‌పై వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్

తమిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన తెలుగువాడు విశాల్.. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మితో చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. శరత్ కుమార్‌ను ఎదిరించి నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసినపుడు కూడా విశాల్ వెంటే వరలక్ష్మి ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. చాలా ఏళ్ల పాటు తమ గురించి జరిగిన ప్రచారాన్ని వీళ్లిద్దరూ ఖండించలేదు.

ఒకరి గురించి ఒకరు పాజిటివ్‌గానే మాట్లాడారు. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నాక కథ మారిపోయింది. 'అర్జున్ రెడ్డి'లో ఓ పాత్ర చేసిన అనీషాతో విశాల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆమెను త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. దీంతో వరలక్ష్మితో అసలు విశాల్ బంధంలో ఎక్కడ తేడా వచ్చిందో జనాలకు అర్థం కాలేదు.

ఇదిలా ఉంటే గత ఏడాది కూడా విశాల్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ చాలా గొప్పగా మాట్లాడిన వరలక్ష్మి.. తాజాగా అతడిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. నడిగర్ సంఘంలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో విశాల్ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. తమ బృందాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరాడు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్‌ను మరోసారి విమర్శించాడు. దీంతో వరలక్ష్మికి మండిపోయింది.

విశాల్ తెరమీదే కాదు.. బయట కూడా మంచి నటుడు అంటూ సెటైర్ వేసిన ఆమె.. అతను నడిగర్ సంఘం కార్యదర్శిగా చేసిందేమీ లేదని పేర్కొంది. విశాల్ టీంలోని వాళ్లకే అతడిపై నమ్మకం లేదని.. అందుకే అతడితో బంధం తెంచుకుని రెబల్ టీం పెట్టారంది. విశాల్ తాను ఏమీ సాధించలేక.. ఇతరుల మీద పడి ఏడుస్తాడని.. అలాగే తన తండ్రిని కూడా నిందించాడని.. అతను ఇంత దిగజారుతారని ఊహించలేదని అంది వరలక్ష్మి.
   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English