వీడని ‘సాహో’ సస్పెన్స్

వీడని ‘సాహో’ సస్పెన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ టీజర్ రానే వచ్చింది. అనుకున్నట్లే ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడని యాక్షన్ బొనాంజాను ఈ సినిమా అందించబోతోందని టీజర్ చూస్తే స్పష్టమైంది. 1 నిమిషం 39 సెకన్ల నిడివి ఉన్న టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా అనిపించింది. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే యాక్షన్ విజువల్స్‌ కళ్లు చెదిరిపోయేలా చేశాయి.

చివర్లో ప్రభాస్ హల్క్ అవతారంలో కనిపించిన ఒక షాట్.. ‘ఫ్యాన్స్.. డైహార్డ్ ఫ్యాన్స్’ అనే డైలాగ్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. కథ పరంగా పెద్ద విశేషమేమీ ఇందులో ఉండకపోవచ్చు. విజువల్స్.. యాక్షన్ సన్నివేశాలే సినిమాను నడిపించేలా కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ మూమెంట్స్‌కు లోటే లేదనిపిస్తోంది.

ఐతే అన్నీ ఓకే కానీ.. ‘సాహో’ మ్యూజిక్ విషయంలో నెలకొన్న సస్పెన్సుకి టీజర్‌తో అయినా తెరదించుతారేమో అనుకుంటే అదేమీ జరగలేదు. టీజర్ చివర్లో ఇచ్చిన క్రెడిట్స్‌లో చాలామంది టెక్నీషియన్ల పేర్లు పడ్డాయి. కానీ ఎక్కడా సంగీత దర్శకుడి పేరు లేదు. దర్శకుడి కింద సినిమాటోగ్రాఫర్ మది, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ కమల్ కన్నన్‌ల పేర్లు వేశారు. కానీ వీరి కంటే ముందు కనిపించాల్సిన సంగీత దర్శకుడి పేరు మాత్రం లేదు. ఐతే కింద టీజర్ డిస్క్రిప్షన్లో మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ క్రెడిట్ జిబ్రాన్‌కు ఇచ్చారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘సాహో’ ఛాప్టర్-2 వీడియోకు కూడా అతనే మ్యూజిక్ ఇచ్చాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.

టీజర్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ అతను అదరగొట్టేశాడు. కానీ క్రెడిట్స్‌లో మాత్రం అతడి పేరు లేదు. మరి సినిమాకు అతను మ్యూజిక్ చేస్తున్నట్లా లేదా అన్నది తెలియడం లేదు. శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకున్నాక సినిమా మొత్తం మ్యూజిక్ బాధ్యతలు అతడికి అప్పగించినట్లు వార్తలొచ్చాయి. కానీ టీజర్లో క్రెడిట్ ఇవ్వలేదంటే పాటల బాధ్యత అతడికి ఇవ్వనట్టేనేమో? సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ అయినా అతడితో చేయించుకుంటారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English