మహేష్‌ ఓవర్‌ రియాక్ట్‌ ... ప్రొడ్యూసర్స్‌ సైలెంట్‌

మహేష్‌ ఓవర్‌ రియాక్ట్‌ ... ప్రొడ్యూసర్స్‌ సైలెంట్‌

వంశీ పైడిపల్లిని ఆకాశానికి లేపేస్తూ చివరి విడత ట్వీట్లు మహేష్‌ ఊదరగొట్టగా, అభిమానులు సయితం వెక్స్‌ అయిపోయి ఇక చాల్లెద్దూ అని ముఖం తిప్పేసుకున్నారు. అక్కడికేదో చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసినట్టు ఫీలయిపోతున్న వంశీ పైడిపల్లి తనకి బాసటగా మహేష్‌ నిలబడే సరికి కాస్త కూడా నేల మీద నిలబడలేకపోతున్నాడు.

మహేష్‌ ఎందుకని ఇంత ఓవర్‌గా రియాక్ట్‌ అవుతున్నాడనేది అతనికే ఎరుక. కానీ చెప్పిన బడ్జెట్‌ కంటే దాదాపు నలభై కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టించిన వంశీ పైడిపల్లిపై ముగ్గురు నిర్మాతలూ సైలెంట్‌గా ఫైర్‌ అవుతున్నారు. కానీ అతనికి హీరోగారే అండగా నిలబడే సరికి గట్టిగా మాట్లాడలేక సైలెంట్‌గా చోద్యం చూస్తున్నారు. మహర్షి ఎలా చూసినా కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అనేది జగద్విదితం. నష్టాలు గ్యారెంటీ అని తేలిపోయిన సినిమాని చూపించి మహేష్‌ ల్యాండ్‌మార్క్‌ సినిమా, తన కెరియర్‌ బెస్ట్‌ అని చెప్పుకోవడమూ బహిరంగ నిజం.

అయితే ఇది హీరో డామినేటెడ్‌ ఇండస్ట్రీ. దర్శకుడి మీద కోపంతో హీరోతో సున్నం పెట్టుకోలేరు నిర్మాతలు. అందుకే పైడిపల్లి అతిని కూడా భరిస్తూ మహేష్‌ గుడ్‌ బుక్స్‌లో మిగిలిపోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో అండర్‌ కరెంట్‌గా అందరికీ పైడిపల్లి పెట్టించిన వృధా ఖర్చు గురించి పాకిపోవడంతో ఇప్పుడతని పేరు చెబితే నిర్మాతలు పారిపోతున్నారని గుసగుసలాడుతున్నారు. తనపై వస్తోన్న వదంతులని కౌంటర్‌ చేయాలంటే పైడిపల్లి త్వరగా ఏదో ఒక సినిమా అనౌన్స్‌ చేయక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English