రాజమౌళి రేంజ్‌ ఇదీ!

రాజమౌళి రేంజ్‌ ఇదీ!

ఎన్టీఆర్‌, చరణ్‌తో రాజమౌళి తీస్తోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో ఒక కథానాయికగా నటిస్తోన్న ఆలియా భట్‌కి తెగ వెయిట్‌ ఇచ్చేస్తోంది తెలుగు మీడియా. ఈ చిత్రానికి బాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చిపెట్టడం కోసం ఒక స్టార్‌ హీరోయిన్‌ వుండాలని ఆలియా వెంట రాజమౌళి అదే పనిగా పడ్డాడని, ఆమె కాదనలేనంత పారితోషికం ఆఫర్‌ చేసి ఈ చిత్రంలో అవకాశం ఇచ్చాడని తెగ రాసేస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రం షూటింగ్‌కి తనకి అనువైన టైమ్‌లో వస్తానని అంటోందని, ఆమె వల్ల హీరోయిన్‌కి సంబంధించిన సీన్లు తీయలేకపోతున్నారని కూడా ప్రచారంలో వుంది.

కానీ వాస్తవం ఏమిటంటే తనకో అవకాశం ఇవ్వమని ఆలియానే రాజమౌళి వెంట పడిందట. ఈగ చిత్రాన్ని హిందీలో అనువదించినపుడు అది చూసి ఆలియా ఆయనకి పెద్ద ఫాన్‌ అయిపోయిందట. అందులో హీరోయిన్‌ పాత్రకి ఇచ్చిన ప్రాధాన్యత చూసి ఒక కమర్షియల్‌ చిత్రంలో హీరోయిన్‌కి ఇంత సీన్‌ ఇవ్వడం మాటలు కాదంటూ ముగ్ధురాలయిపోయిందట. అలాగే బాహుబలిలోను అనుష్కకి దక్కిన పాత్ర చూసి ఎలాగైనా రాజమౌళి సినిమాలో నటించాలని అనుకుందట. అతనికి బాలీవుడ్‌ మార్కెట్‌ వచ్చింది కనుక ఈసారి తీసే సినిమాలో హిందీ హీరోయిన్‌ కావాలనుకునే అవకాశముంది కనుక ముందే ఒక మాట వేసి వుంచిందట. అలా ఆలియాకి ఈ చిత్రంలో అవకాశం దొరికింది తప్ప రాజమౌళి ఆమె వెంట పడి డేట్లు సాధించుకోలేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English