రచ్చ లేపుతోన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

రచ్చ లేపుతోన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

టాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎందుకో త్వరగా ఫేడవుట్‌ అయిపోయింది. సమంత తర్వాత టాప్‌లోకి వెళుతుందని భావించిన రకుల్‌ చాలా త్వరగా మాయమయింది. ప్రస్తుతం అవకాశాలు లేక సీనియర్‌ హీరో నాగార్జునతో 'మన్మథుడు 2'లో నటిస్తోంది. బాలీవుడ్‌లో ఇంతకు ముందే పరిచయం వున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 'దే దే ప్యార్‌ దే' అనే చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌కి జోడీగా నటిస్తోంది. తనకంటే వయసులో రెండింతలు పెద్దవాడయిన హీరోతో రకుల్‌ రొమాన్స్‌ ఈ చిత్రానికి సెల్లింగ్‌ పాయింట్‌ అయింది. ఇదిలా వుంటే ఈ చిత్రంలోని తొలి పాట ఇటీవలే విడుదలయింది.

'వడ్డీ షరాబన్‌' అంటూ సాగే ఆ పాటలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చీర కట్టుకుని కనిపించినా కానీ తన హొయలని విచ్చలవిడిగా ఆరబోసింది. రకుల్‌ గ్లామర్‌ షో వృధా కాకుండా ఈ పాట ఇప్పటికే మంచి హిట్టయింది. ఇప్పటికే పదిహేను మిలియన్లకి పైగా వ్యూస్‌ సాధించిన ఈ పాటతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ట్రెయిలర్‌ కూడా యాభై మిలియన్ల వ్యూస్‌ రావడం దీనిపై వున్న ఆసక్తి ఎంత అనేది తెలియజేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English