అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్‌తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి అక్కడి జనం బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. ‘కాంతార’ రెండు పార్ట్‌లు అక్కడ చాలా బాగా ఆడాయి. ‘అఖండ’కు కూడా డిజిటల్ రిలీజ్ టైంలో మంచి స్పందన రావడంతో ‘అఖండ-2’ను పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దడానికి టీం బాగానే కష్టపడింది. హిందీ ఆర్టిస్టులు చాలామందిని తీసుకున్నారు. డబ్బింగ్ కూడా శ్రద్ధగా చేశారు. ముంబయికి వెళ్లి ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు.
దీంతో ‘అఖండ-2’ హిందీలో బాగా ఆడేస్తుందని.. బాలయ్యకు పాన్ ఇండియా ఫాలోయింగ్ తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశించారు. కానీ అలా ఏమీ జరగలేదు. ‘అఖండ-2’కు తెలుగులోనే ఆశించిన టాక్ రాలేదు. మిక్స్డ్ టాక్‌తో మొదలై తొలి వీకెండ్ వరకు ఓపెనింగ్స్ అయితే బాగానే తెచ్చుకుంది. కానీ సోమవారం నుంచి సినిమా వీక్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక హిందీ వెర్షన్ సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడ సినిమాకు సరైన రిలీజే దక్కలేదు. మొత్తం నార్త్ ఇండియా అంతటా కలిపితే హిందీ షోలు వంద కూడా పడని పరిస్థితి.
ముంబయి, దిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో పట్టుమని పది షోలు కూడా ఇవ్వలేదు ‘అఖండ-2’ హిందీ వెర్షన్‌కు. వాటికి స్పందన కూడా అంతంతమాత్రంగానే ఉంది. ‘దురంధర్’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం ‘అఖండ-2’కు పెద్ద మైనస్ అయింది. అది ఉండగా దీన్ని అస్సలు పట్టించుకోవట్లేదు హిందీ జనం. ప్రధాన నగరాల్లో వీకెండ్లో కూడా పెద్దగా ఆక్యుపెన్సీలు లేవు.
వీక్ డేస్‌కు వచ్చేసరికి పూర్తిగా థియేటర్లు ఖాళీ అయిపోయాయి. అందుబాటులో ఉన్న కొన్ని షోలకు కూడా జనం లేరు. ‘అఖండ-2’ పట్ల హిందీ జనాల్లో పెద్దగా ఆసక్తి లేదన్నది స్పష్టం. టాక్ బాగుంటే సినిమా పుంజుకునేదేమో కానీ.. అదీ జరగలేదు. డివైన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా అక్కడి జనం సినిమాకు కనెక్ట్ కాకపోవడంతో ‘అఖండ-2’ హిందీ వెర్షన్ ఏమాత్రం ప్రభావం చూపకుండానే థియేట్రికల్ రన్ ముగించేలా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates