క్రిష్‌ అఫీషియల్‌గా అవుట్‌

క్రిష్‌ అఫీషియల్‌గా అవుట్‌

'మణికర్ణిక' చిత్రానికి దర్శకుడు క్రిష్‌ కాదని కంగన డైరెక్టుగా చెప్పేస్తోంది. మొదట్లో అతనితో ఇష్యూస్‌ ఏమీ లేవని, ఒక అండర్‌స్టాండింగ్‌ ప్రకారమే అతను ఎన్టీఆర్‌ బయోపిక్‌కి డేట్స్‌ ఇచ్చాడని చెప్పిన కంగన ఇప్పుడు ఈ చిత్రానికి తానే దర్శకురాలినని ప్రకటించుకుంటోంది. సోనూ సూద్‌తో జరిగిన గొడవలో భాగంగా అతనికి లేడీ డైరెక్టర్‌తో పని చేయడం ఇష్టం లేదని, అందుకే వెళ్లిపోయాడని ఆమె పేర్కొంది. అవసరానికి విమెన్‌ కార్డ్‌ ప్లే చేస్తోందని సోనూ కూడా ఆమెపై ఫైర్‌ అయ్యాడు.

తనకి లేడీ డైరెక్టర్‌తో పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, గతంలో ఫరా ఖాన్‌తో హ్యాపీ న్యూ ఇయర్‌ చేసానని గుర్తు చేసాడు. అయితే అతను క్రిష్‌తో కలిసి కథలో లేని కుస్తీ సన్నివేశాలు జోడించాడని, వాటిని రైటర్లు తీసేయాలని కోరడంతో తొలగించానని, దాంతో అతను హర్ట్‌ అయి వెళ్లిపోయాడని కంగన అంటోంది. ఈ వివాదం మాట ఎలాగున్నా కానీ నిన్న మొన్నటి వరకు తెరచాటున వున్న దర్శకుడి మార్పు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చేసింది. మరి తెరపై దర్శకుడిగా క్రిష్‌తో పాటు తన పేరు వేసుకుంటుందా లేక పూర్తిగా అతని పేరు తొలగిస్తుందా అనేది ఆమె ఇష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు