ఇంటికెళ్ళి ఆమెను ఒప్పించిన బాలయ్య

ఇంటికెళ్ళి ఆమెను ఒప్పించిన బాలయ్య

విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత గాథతో ఆయన తనయుడు - హీరో బాలకృష్ణ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్  నటించనుందనే విషయం అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ఎన్టీఆర్ సినిమాలో బసవతారకం పాత్ర కోసం ఆమె పేరు చాలా రోజులుగా వినిపిస్తున్నా చాలారోజుల పాటు దీనిపై విద్యాబాలన్ వైపు నుంచి అంగీకారం రాలేదు.

విద్యాబాలన్ ఈ ప్రాజెక్టు ఓకే చేయడానికి కారణం బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగడమేనట. విద్యాబాలన్ ఈ ఆఫర్ చాలా రోజుల పాటు పెండింగ్ లో పెట్టిన నేపథ్యంలో బాలయ్య ముంబయిలో వెళ్లి ఆమె ఉండే ఫ్లాట్ కు వెళ్లాడు. బాలయ్య సడెన్ విజిట్ తో ఆశ్చర్యపోయిన విద్యాబాలన్ ఆయనతో మూడు గంటలకు పైగా మాట్లాడింది. ఈ సినిమా ఎంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది... ఇందులో ఆమె రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేదీ నెరేట్ చేశాడట. దీంతో ఈ సినిమా చేసేందుకు విద్యాబాలన్ ఓకే చెప్పిందట.

బాలయ్య ఇలా ఒక రోల్ కోసం యాక్టర్లను స్వయంగా కలిసి మాట్లాడటం అన్నది చాలా తక్కువ. ఎన్టీఆర్ బయోపిక్ అనేది ఓ రకంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే కాస్టింగ్ విషయంలోనూ ఏ మాత్రం రాజీపడలేదు. బసవతారకం పాత్రకు విద్యాబాలన్ 100 % న్యాయం చేస్తుందని నమ్మబట్టే పట్టుబట్టి ఆమెను ఒప్పించాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ మూవీని క్రిష్ డైరెక్ట్  చేయబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English