వావ్.. రజినీకి విలన్‌గా ఆ నటుడు

వావ్.. రజినీకి విలన్‌గా ఆ నటుడు

‘2.0’.. ‘కాలా’ సినిమాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఇక మళ్లీ నటించడేమో అని సందేహించారు అతడి అభిమానులు. ఎందుకంటే ఈ సినిమాల పని పూర్తి చేయగానే రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన చేశాడు సూపర్ స్టార్. ఆ ప్రకటన ఓ వైపు ఆనందాన్నిస్తూనే.. మరోవైపు రజినీ సినిమాలకు దూరమైపోతున్నారనే ఆవేదన కూడా కలిగించింది అభిమానుల్లో. కానీ రజినీ అభిమానుల్లో ఉత్సాహం నింపుతో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి విలక్షణ దర్శకుడితో రజినీ సినిమా ఓకే చేయడం మరింత ఆసక్తి రేకెత్తించింది. ఇంతకుముందు ‘2.0’ లాంటి మెగ ప్రాజెక్టును నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర అప్ డేట్ బయటికి వచ్చింది.

ఈ చిత్రంలో రజనీకాంత్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నాడట. నటుడిగా విజయ్ సేతుపతి స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత దశాబ్ద కాలంలో దక్షిణాదిన నటుడిగా అతడిలా పేరు తెచ్చుకున్న మరొకరు కనిపించరు. కమల్ హాసన్.. విక్రమ్‌ల తర్వాత ఆ స్థాయి నటుడనిపించుకున్నాడు. ఇలాంటి నటుడు రజనీకి విలన్ అవుతున్నాడంటే ఆ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందన్న ఆసక్తి జనాల్లో కలుగుతోంది. కార్తీక్‌కు విజయ్ చాలా క్లోజ్. వీళ్లిద్దరి తొలి సినిమా ‘పిజ్జా’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇద్దరూ అక్కడి నుంచే మంచి స్థాయికి చేరుకున్నారు. కార్తీక్ తీసిన తర్వాతి రెండు సినిమాల్లోనూ విజయ్ సేతుపతి నటించాడు. ‘జిగర్‌తండ’లో అతిథి పాత్ర చేసిన అతను.. ‘ఇరైవి’లో ప్రధాన పాత్రధారిగా నటించాడు. మరి రజనీ సినిమాలో తన మిత్రుడి కోసం కార్తీక్ ఎలాంటి పాత్ర తీర్చిదిద్దాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు