రెండు బ్యానర్లకు టిక్ పెట్టేశా

రెండు బ్యానర్లకు టిక్ పెట్టేశా

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇంతవరకు చిన్న బ్యానర్లలో పెద్ద హిట్లు కొట్టిన ఈ యంగ్ హీరో కెరీర్ లో తొలిసారి పెద్ద బ్యానర్ లో సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్2 - యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన టాక్సీవాలా సినిమాతో మరోసారి యూత్ ను మెప్పిస్తామంటున్నాడు.

టాక్సీవాలా సినిమాకు పనిచేసిందంతా యంగ్ టీమే. హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ రాహుల్ తోపాటు పనిచేసిన టెక్నీషియన్స్ చాలావరకు యంగ్ టీమే. టాక్సీవాలా సినిమాలో సూపర్ నాచురల్ - థ్రిల్లర్ - కామెడీ ఇలా చాలా జోనర్లకు సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నాయన్న ఈ యంగ్ హీరో దీనికో కొత్త పేరు పెట్టాడు. అదేమిటంటే హై కాన్సెప్ట్ స్ట్రెస్ బస్టర్. ఉదయం లేచింది మొదలు వాళ్లు అదన్నారు.. వీళ్లు ఇదన్నారు మొదలుకొని ఎన్నో టెన్షన్లు ఉంటాయని... వీటన్నింటితో పెరిగే ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.  సినిమా చూస్తే నవ్వి చచ్చిపోవాల్సిందేనన్నాడు.

యాక్టరయ్యాక తాను ఎప్పటికైనా చేయాలి అనుకున్న బ్యానర్లలో రెండింటికి ఈ సినిమాతో టిక్ పెట్టేసుకున్నానని విజయ్ చెప్పుకొచ్చాడు. ఒక యంగ్ బ్యాచ్ కు ఫుల్ ఎక్సైట్ చేసే స్క్రిప్ట్ ఇచ్చి కంప్లీట్ ఫ్రీడం ఇవ్వడంతో ఈ సినిమా పూర్తయిందని హ్యాపీగా చెప్పాడు. టాక్సీవాలా మూవీతో ప్రియాంక జవాల్కర్.. మాళవిక నాయర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు