అతని సినిమా కొనేదెవరు?

అతని సినిమా కొనేదెవరు?

గోపిచంద్‌ సినిమాలు ఒకప్పుడు హాట్‌ కేకుల్లా అమ్ముడయిపోయేవి. అనౌన్స్‌ చేయడం ఆలస్యం బయ్యర్లు ఎగబడి రైట్స్‌ తీసేసుకునేవారు. ఇండస్ట్రీలో చాలా ఓడలు బళ్లు అయినట్టే ప్రస్తుతం గోపిచంద్‌ సినిమాలకి కూడా గిరాకీ లేకుండా పోయింది. వరుస పరాజయాలకి తోడు అతని ఇటీవలి చిత్రాలు విడుదల కావడానికే తంటాలు పడుతోన్న నేపథ్యంలో గోపిచంద్‌ నటిస్తున్న తాజా చిత్రం 'పంతం'కి బయ్యర్లు దొరకడం లేదట.

అతని గత చిత్రాలు ఆక్సిజన్‌, గౌతమ్‌ నంద డిజాస్టర్స్‌ అవడంతో ఈ చిత్రానికి ఒక మాదిరి రేట్లు చెప్పినా కానీ ఎవరూ ముందుకు రావడం లేదట. కావాలంటే త్రూ రిలీజ్‌ పెట్టుకోమని, కమీషన్‌ ఇస్తామని అంటున్నారట. మరోవైపు ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తే అది ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల వచ్చిన ఫస్ట్‌ లుక్స్‌లో ఇంత నాసి రకం ఫస్ట్‌ లుక్‌ ఏదీ లేదని కామెంట్లు పడ్డాయి. పోస్టర్‌ డిజైనింగ్‌ నుంచి అన్నిట్లోను ఇప్పుడు ప్రత్యేకత చాటుకోవడం, ఇమ్మీడియట్‌గా ఆసక్తి రాబట్టుకోవడం ట్రెండ్‌ అయింది.

ఏ సినిమాకి అయినా విడుదలకి ముందు ఆసక్తి రేకెత్తించే ప్రమోషన్స్‌ లేనట్టయితే కనీసం ఓపెనింగ్స్‌ కూడా రావడం లేదిపుడు. ట్రెండ్‌కి తగ్గట్టు అందరు హీరోలు అప్‌డేట్‌ అయితే బాగుంటుందేమో కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు