కాలా ఆయింట్మెంట్.. కిక్కివ్వట్లేదు

కాలా ఆయింట్మెంట్.. కిక్కివ్వట్లేదు

రజినీకాంత్ నటించిన 2.ఓ చిత్రం కోసం అభిమానులు మాత్రమే కాదు.. ఆ చిత్ర నిర్మాతలు అయిన లైకా ప్రొడక్షన్స్ కూడా ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఇప్పటికి మూడు సార్లు విడుదల వాయిదా పడగా.. ఇప్పుడు ఏప్రిల్ రేసు నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే.. రోబో సీక్వెల్ రా రూపొందుతున్న ఈ చిత్రం వాయిదా వేయాలనే నిర్ణయం పూర్తిగా దర్శకుడిదే.

 కానీ దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతూ.. ఇండియాస్ కాస్ట్లియెస్ట్ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ కు మాత్రం.. శంకర్ వ్యవహారం విసుగు తెప్పిస్తోంది. కానీ ఔట్ పుట్ విషయంలో కొంచెం కూడా కాంప్రమైజ్ కాకూడదన్నది శంకర్ యోచన. అందుకే ఇండిపెండెన్స్ డే లేదా దీపావళికి వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. దీనికి లైకా వాళ్లను ఒప్పించడం శంకర్ వల్ల కాలేదు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎంటర్ అయిన సూపర్ స్టార్.. ఎట్టకేలకు ఇద్దరికీ సయోధ్య చేశాడట. ఇంతకీ ఆ డీల్ ఏంటంటే.. సరిగ్గా 2.ఓ రిలీజ్ అనుకున్న రోజునే కాలాను విడుదల చేయడమే. ఇక్కడ వరకు బాగానే ఉంది.

నిజానికి రజనీ చేసిన ఎరేంజ్మెంట్ బాగానే ఉంది కాని.. అసలు రోబో 2.0 కోసం మనోళ్ళు ఎన్నో ధియేటర్లను లైన్లో పెట్టుకున్నారు కదా..  వాటన్నింటిలో కాలా వేయడం ఎంతవరకు కరక్టు? ఆడియన్స్ కు ఏదైనా ఓకె.. కాని.. ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ విషయంలో గగ్గోలు పెడుతున్నాయి. ఫ్యామిలీలు అందరూ వస్తారని ఎన్నో సినిమాలను పక్కనెట్టి 2 పాయింట్ ఓ కోసం వెయిట్ చేస్తున్న ధియేటర్లకు పంపిణీవార్లకు ఇప్పుడు రజనీకాంత్ కాలా మందేశారు కాని.. ఈ మందు కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ రారు. కబాలి విషయంలోనూ అదే జరిగింది. తొలి మూడు రోజులు వచ్చిన ఫ్యాన్స్ అండ్ మాస్ ప్రేక్షకులు తప్పించి తరువాత ధియేటర్లకు ఫ్యామిలీలు రాలేదు. అందుకే ట్రేడ్ సెక్టార్ కు ఈ ఆయింట్మెంట్ పెద్దగా కిక్కివ్వట్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు