బెల్లంకొండ.. అంత తగ్గిపోయాడేంటి

బెల్లంకొండ.. అంత తగ్గిపోయాడేంటి

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తొలి సినిమానే వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో చేశాడు. రెండో సినిమాకు భీమనేని శ్రీనివాసరావు లాంటి ఒకప్పటి స్టార్ డైరెక్టర్‌ను ఎంచుకున్నాడు. అది కూడా ‘సుడిగాడు’తో ఆయన సూపర్ హిట్ కొట్టి ఉండబట్టే. ఇక మూడో సినిమాను బోయపాటి శ్రీను లాంటి నేటి తరం స్టార్ డైరెక్టర్‌తో చేశాడు. బాలయ్యతో ‘డిక్టేటర్’ లాంటి భారీ సినిమా తీసిన శ్రీవాస్‌తో ఇప్పుడు తన నాలుగో సినిమా చేస్తున్నాడు. ఇలా చాలా వరకు పెద్ద పెద్ద దర్శకులతో కలిసి భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నాడు శ్రీనివాస్. ఐతే తన ఐదో సినిమాకు మాత్రం బెల్లంకొండ తన రేంజ్ తగ్గించుకుంటున్నట్లు సమాచారం.

యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో శ్రీనివాస్ తన తర్వాతి సినిమా చేయబోతున్నాడట. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఓంకార్ మొదట్నుంచి తక్కువ బడ్జెట్లోనే సినిమాలు చేస్తున్నాడు. నాగార్జునతో చేసిన ‘రాజు గారి గది-2’ బడ్జెట్ కూడా తక్కువే. శ్రీనివాస్‌తో కూడా అతను తక్కువ బడ్జెట్లోనే సినిమా చేయబోతున్నట్లు సమాచారం. తొలి సినిమా తర్వాతి నుంచి బెల్లంకొండ చేస్తున్నది బయటి బేనర్లలోనే అయినా వాటికి ఫినాన్షియల్ బ్యాకప్ ఇస్తున్నది అతడి తండ్రి బెల్లంకొండ సురేషే అన్నది బహిరంగ రహస్యం. ఐతే ప్రతి సినిమాకూ భారీగా చేతి నుంచి ఖర్చు పెట్టుకుంటున్న సురేష్.. ఈసారి కొడుకు సినిమాను తక్కువ బడ్జెట్లో కానివ్వాలని చూస్తున్నాడట. అందుకే ఓంకార్ కథకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సొంతంగా నిర్మించినా.. లేక తమ బ్యాకప్‌తో వేరే వాళ్లతో చేయించినా.. తక్కువ ఖర్చుతో చేయాలన్నది వాళ్ల ప్లాన్ అని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English