సుచీ లీక్స్‌పై సమంత ఏమందంటే..

సుచీ లీక్స్‌పై సమంత ఏమందంటే..

సుచి లీక్స్.. ఈ ఏడాది ఆరంభంలో తమిళ ఫిలిం సెలబ్రెటీల గుండెల్లో గుబులు రేపిన వ్యవహారం. ఈ వ్యవహారం సోషల్ మీడియాను ఎంతగా భ్రష్టు పట్టించిందో కూడా తెలిసిందే. ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఎన్నెన్నో బూతు ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాను ముంచెత్తేశారు జనాలు. దీనిపై అప్పట్లో చాలా పెద్ద చర్చే నడిచింది. కొందరు సెలబ్రెటీలు ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు.

ఈ ఇష్యూలో బాధితులనుకున్న సెలబ్రెటీలు కూడా దీనిపై స్పందించారు. ఐతే ఈ వ్యవహారాన్ని అందరూ మరిచిపోయాక ఇప్పుడు ‘రాజు గారి గది-2’తో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోర్ కాన్సెప్ట్ కొంతమేర సుచి లీక్స్‌తో ముడిపడ్డదే. దీనిపై సినిమా విడుదలకు ముందే చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది సమంత.

ఇప్పుడు మరోసారి ఆ ఇష్యూ మీద ఆమె స్పందించింది. ఈ మధ్య కాలంలో తాను చూసిన అత్యంత చెత్త విషయం సుచీ లీక్సే అని సమంత చెప్పింది. మనుషుతల్లోని మురికిని మరో కోణంలో ఈ ఇష్యూ చూపించిందని ఆమె అంది. వాటిపై చాలామంది తెలిసో తెలియకో రకరకాలుగా వ్యాఖ్యానించారని.. జరిగింది ఒకటైతే మాట్లాడుకున్నది ఇంకోటి అని.. జనాలకు మామూలుగా నెగెటివ్ విషయాలే ఎక్కువ నచ్చుతాయని.. ఈ వ్యవహారం చూస్తే మనుషుల్లో ఇంత మురికి ఉందా అనిపించిందని సమంత చెప్పింది.

సినీ పరిశ్రమకు అవన్నీ దుర్దినాలే అని ఆమె వ్యాఖ్యానించింది. అప్పటివరకు తాను ట్విట్టర్లో బాగా కనిపించేదాన్నని.. ఇప్పుడు బాగా తగ్గించేశానని.. తన స్నేహితుల్లో చాలామంది ట్విట్టర్‌కి దూరమయ్యారని సమంత తెలిపింది. ఇది వరకు మనసులో ఏదనిపిస్తే అది చెప్పే స్వేచ్ఛ ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని.. ఏం మాట్లాడితే ఏమవుతుందో.. ఎలా తీసుకుంటారో అన్న భయం కారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే మంచిదనిపిస్తోందని సమంత అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు