బయ్యర్ల శంక లెక్కచేయని శంకర్‌

బయ్యర్ల శంక లెక్కచేయని శంకర్‌

సడన్‌గా '2.0' మేకింగ్‌ వీడియో విడుదల చేయడంతో శంకర్‌ అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఈ చిత్రం ఎలా వుండబోతుందనేది ఇంతకాలం గోప్యంగా వుంచిన శంకర్‌ సడన్‌గా ఎందుకని ప్రమోషన్‌ మొదలు పెట్టాడని అనుకున్నారు. అయితే జనవరి 25న రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు కనుక సరిగ్గా అయిదు నెలల ముందు పబ్లిసిటీ స్టార్ట్‌ చేసాడట. జనవరి 25న '2.0' విడుదల చేయాలని శంకర్‌ ఫిక్స్‌ అయ్యాడని సమాచారం.

అయితే ఈ డేట్‌కి వద్దని బయ్యర్స్‌ కోరుతున్నారట. వస్తే సంక్రాంతికి రమ్మని, లేదా వేసవికి వెళ్లండని అడుగుతున్నారట. సంక్రాంతికి వస్తే తమిళం, తెలుగులో కూడా భారీ వసూళ్లు రాబట్టవచ్చునని, జనవరి 25న వస్తే లాంగ్‌ రన్‌ రావడం కష్టమని చెబుతున్నారట. లేదంటే వేసవిలో విడుదల చేస్తే 'బాహుబలి 2' మాదిరిగా ఒక నాలుగు వారాలైనా హ్యాపీగా వసూళ్లు రాబట్టుకోవచ్చునని అంటున్నా కానీ శంకర్‌ మాత్రం ఎందుకో జనవరి 25కే కట్టుబడ్డాడట.

ప్రమోషన్‌ కోసం అయిదు నెలల సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికే మేకింగ్‌ వీడియోని ఆగస్టు 25న విడుదల చేసాడని, త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన వన్‌ మినిట్‌ వీడియోని వదలబోతున్నారని కోలీవుడ్‌ టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు