వైరల్‌ వీడియో: అసిస్టెంట్‌ని కొట్టిన బాలకృష్ణ

వైరల్‌ వీడియో: అసిస్టెంట్‌ని కొట్టిన బాలకృష్ణ

బాలకృష్ణకి మరోసారి నెగెటివ్‌ పబ్లిసిటీ తెచ్చిపెట్టిందొక వీడియో. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం షూటింగ్‌ ఈరోజు మొదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు షూటింగ్‌లో తన అసిస్టెంట్‌పై బాలకృష్ణ చేయి చేసుకోవడం కెమెరాలకి చిక్కింది. తన కాళ్లకున్న చెప్పులు మార్చమని బాలయ్య తన అసిస్టెంట్‌ని అడగగా అతను ఆలస్యంగా స్పందించాడు. దాంతో బాలయ్య ఫైర్‌ అయి అతని నెత్తి మీద ఒకటి కొట్టారు.

దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌తో పాటు చాలా మంది చూస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అతడిని కొట్టేసి క్యాజువల్‌గా ఏమీ జరగనట్టు తన సంభాషణ కొనసాగించడం ఈ వీడియోలో కనిపించింది. దీంతో ఇంటర్నెట్‌లో ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అయింది.

బాలయ్య ఆవేశం కెమెరాలకి చిక్కడం ఇది మొదటిసారి ఏమీ కాదు కానీ షూటింగ్‌ స్పాట్‌ నుంచి ఇలాంటివి రావడం మాత్రం అరుదు. ఈ సంఘటనతో దర్శకుడు రవికుమార్‌ బిత్తరపోయారని, తొలి రోజు చేద్దామనుకున్న షూటింగ్‌ కూడా ఆపేసి ప్యాకప్‌ చెప్పేసారని ప్రచారం జరుగుతోంది.

నిన్న పైసావసూల్‌ చిత్రానికి గుమ్మడికాయ కొట్టి, ఇవాళ కొత్త సినిమా స్టార్ట్‌ చేసిన బాలయ్యని జనం మెచ్చుకుంటూ వుండగానే ఈ వీడియో లీక్‌ అయి ఆయనని బ్యాడ్‌ లైట్‌లో చూపెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English