నారా బాబూ... ఎన్నాళ్లీ బాదుడు?

నారా బాబూ... ఎన్నాళ్లీ బాదుడు?

నారా రోహిత్‌కి కొద్ది రోజుల్లో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇచ్చేసేలా వున్నారు. ఎలాంటి ట్రెయినింగ్‌, రాత పరీక్ష లేకుండానే, హానరరీగా నారా రోహిత్‌కి పోలీస్‌ శాఖ నుంచి ఆహ్వానం అందవచ్చు. ఎందుకంటే నారా రోహిత్‌ చేసినన్ని పోలీస్‌ పాత్రలు ఇంకెవరూ చేసి వుండరు. సాయికుమార్‌, రాజశేఖర్‌ని కూడా దాటేసి పోలీస్‌ పాత్రలు చేస్తోన్న రోహిత్‌, నిజమైన పోలీసుల కంటే ఎక్కువ రోజులు యూనిఫామ్‌లో గడుపుతున్నాడు.

ఈ పోలీస్‌ పాత్రలు చేయడం వల్ల అన్నిట్లోను ఒకటే ఎక్స్‌ప్రెషన్‌, ఒకటే తరహా బాడీ లాంగ్వేజ్‌, ఒకే తరహా డైలాగ్‌ డెలివరీతో నారా రోహిత్‌ చాలా రొటీన్‌ అయిపోతున్నాడు. కనీసం సినిమాకో రకంగా పోలీస్‌ పాత్రలో కొత్తదనం చూపిస్తే ఫర్వాలేదు కానీ ఆహార్యం నుంచి వాచకం వరకు మార్పు లేకుండా అవే పాత్రలు చేయడం వల్ల క్యారెక్టర్‌లో డెప్త్‌ వున్నా ఆడియన్స్‌ వెరైటీ ఫీల్‌ అవడం లేదు. ఇకనైనా ఈ మొనాటనీకి ఫుల్‌స్టాప్‌ పెట్టి, వేరే తరహా పాత్రలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

ఒకటి, రెండు వేరే కథలు చేసిన తర్వాత మళ్లీ పోలీస్‌గా కనిపిస్తే మార్పు ఫీలవుతారని అనుకోవడం అమాయకత్వం. ఇక కొద్ది రోజులు ఈ ఖాకీ చొక్కాకి దూరంగా వుండడానికో, లేదంటే కనీసం పాత్రల పరంగా వేరియేషన్‌ చూపించడానికో రోహిత్‌ ట్రై చేస్తే బెటర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English