బాహుబలి అతని బెస్ట్‌ మూవీ కానే కాదు

బాహుబలి అతని బెస్ట్‌ మూవీ కానే కాదు

'బాహుబలి' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటుతోంది. లార్జ్‌ స్కేల్‌లో తీసిన ఫాంటసీ సినిమాకి రీచ్‌ ఎంత వుంటుందనేది ఈ చిత్రం నిరూపిస్తోంది. కలక్షన్లని బట్టి ఇది రాజమౌళి తీసిన అత్యుత్తమ చిత్రమంటూ మీడియాలో ఒక వర్గం దీనిని ఆకాశానికి ఎత్తేస్తోంది.

అయితే బాహుబలి ఒక మంచి చిత్రమే తప్ప గొప్ప చిత్రం కాదని సినీ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఇంతటి అంచనాలతో వచ్చిన చిత్రం ప్రేక్షకులని సంతృప్తి పరచడమే గొప్ప విషయమని, భారీ అంచనాలున్నపుడు నిరాశ పరచని సినిమా వచ్చినట్టయితే ప్రేక్షకులు దానికి పట్టం కడతారని వారంటున్నారు.

రాజమౌళి గత చిత్రాల గురించి తెలియని వారు బాహుబలి అతని ఉత్తమ చిత్రమని అనుకుంటారు కానీ అతని పనితీరు తెలిసిన ఎవరూ దీనిని రాజమౌళి బెస్ట్‌గా లెక్కించరని విశ్లేషించారు. రాజమౌళి 'ఈగ' ఇంతకంటే సుపీరియర్‌ చిత్రమని, అలాగే అతను తీసిన మాస్‌ సినిమాల్లో సింహాద్రి, ఛత్రపతి బెస్ట్‌ స్క్రిప్ట్స్‌ అని, 'మగధీర' అతడిలోని అసలైన సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని, బాహుబలి కంటే దర్శకుడిగా రాజమౌళి వాటిలోనే ఎక్కువ స్కోర్‌ చేసాడని, స్కేల్‌, రీచ్‌, కలక్షన్స్‌ ప్రాతిపదికన ఒక సినిమా గొప్పతనాన్ని లెక్కించడం సబబు కాదనేది వారి వాదన. ఇంతకీ మీ దృష్టిలో రాజమౌళి బెస్ట్‌ సినిమా ఏది? కామెంట్స్‌లో మీ అభిప్రాయం చెప్పండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు