షాకింగ్: హీరోయిన్ ముందు అంత పనిచేశాడా?

షాకింగ్: హీరోయిన్ ముందు అంత పనిచేశాడా?

కోలీవుడ్ హీరో ధనుష్ హిందీలో నటించిన తొలి సినిమా 'రాన్ జానా' చూసిన వాళ్లందరికీ అందులో అతడి మరదలిగా నటించిన స్వర భాస్కర్ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత 'నీల్ బట్టి సనాటా' అనే మరో సినిమాతో ఆమె మంచి పేరే సంపాదించింది. ఈమె స్వతహాగా తెలుగమ్మాయి కావడం విశేషం. ఐతే స్వర కుటుంబం నార్త్ ఇండియాలో సెటిలైంది.

ఈమె నేపథ్యం సంగతలా ఉంచితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఓ సంచలన విషయాన్ని బయటపెట్టి విస్మయానికి గురి చేసింది. ముంబయిలో ఒకసారి రైల్లో ప్రయాణిస్తుండగా.. ఆమెను చూస్తూ ఒక వ్యక్తి హస్త ప్రయోగం చేశాడట.

కొందరు పర్వర్ట్స్ ఎంత నీచంగా ప్రవర్తిస్తారో చెప్పడానికి ఉదాహరణ ఇదంటూ స్వర భాస్కర్ ధైర్యంగా ఆ ఘటన గురించి ఇంటర్వ్యూలో పంచుకుంది. తాను తొలిసారి ముంబయికి ఆడిషన్స్ కోసం వచ్చిన సమయంలో లోకల్ ట్రైన్ ఎక్కానని.. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో జనాలు తక్కువగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి తనను చూసి హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడని.. తాను షాక్ తిన్నానని.. అతడి చేయి పట్టుకుని తన దగ్గరున్న గొడుగుతో కొట్టానని.. అంతలో స్టేషన్ రాబోతుంటే అతడిని కంపార్ట్మెంట్ నుంచి బయటికి నెట్టబోగా.. అతను తప్పించుకుని మరో వైపు నుంచి పారిపోయాడని స్వర భాస్కర్ తెలిపింది. ఈ సంగతి వినడానికి ఎబ్బెట్టుగా అనిపించినప్పటికీ.. మన దేశంలో మహిళల పట్ల కొందరు పర్వర్ట్స్ ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో చెప్పడానికి ఇది రుజువు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు