డబ్బులిచ్చే వాడంటే మహేష్‌కి లోకువ!

డబ్బులిచ్చే వాడంటే మహేష్‌కి లోకువ!

అన్ని విధాలుగా నిర్మాతలకి సహకరించే హీరోలని 'నిర్మాతల హీరో' అంటుంటారు ఇండస్ట్రీలో. అలా నిర్మాతల హీరో అనిపించుకున్న వారిలో సూపర్‌స్టార్‌ కృష్ణ ముందుంటారు. అయితే ఆయన తనయుడు మహేష్‌ మాత్రం నిర్మాతలకి అస్సలు విలువ ఇవ్వడనే అపనిందలు పడుతున్నాయి. ఒకసారి సినిమా ఓకే చేసినట్టయితే ఇక నిర్మాతకి ఆ సినిమాపై ఎలాంటి హక్కు వుండదని, మహేష్‌ సినిమా విషయంలో నిర్మాత డబ్బులు ఖర్చు పెట్టడం మినహా ఎలాంటి నిర్ణయం తీసుకోలేడని, పూర్తిగా దర్శకుడి పక్షం వహిస్తూ, అతను తప్పులు చేస్తున్నా వెనకేసుకు వస్తాడని మహేష్‌పై అభియోగాలున్నాయి.

 'బ్రహ్మూెత్సవం' చిత్రం విషయంలో నిర్మాణంలో వుండగా పలు అనుమానాలు తలెత్తాయట. సినిమా తేడా అయిపోయే ప్రమాదం కనిపిస్తోందని నిర్మాతకి అనుమానం వచ్చిందట. అదే అనుమానం చాలా మంది వ్యక్తం చేయగా, దర్శకుడు అడ్డాలని సంప్రదించి, అతను క్లారిటీతో ఉండడంతో ముందుకు పోదాం అనేసాడట మహేష్‌. తాజాగా వంశీ పైడిపల్లి కోసమే మహేష్‌ తన ఇరవై అయిదవ చిత్రం బ్యానర్‌ మార్చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్లో చేయలేనని పైడిపల్లి చెప్పడంతో మహేష్‌ అతడి పక్షమే వహించి నిర్మాతని మార్చేసాడంటున్నారు.

ఇప్పుడు తెర మీదకి దిల్‌ రాజు, అశ్వనీదత్‌ అయితే వచ్చారు కానీ ఇక వారికి ఈ చిత్రంపై ఎలాంటి అధికారాలుంటాయని అడుగుతున్నారు. డబ్బులిచ్చే నిర్మాతని పూర్తిగా లెక్క చేయకపోవడం మంచిది కాదని, క్రియేటర్‌ని నమ్మడం కరెక్టే అయినప్పటికీ నిర్మాత మాటకి, అభిప్రాయానికి కూడా మహేష్‌ విలువ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నారు. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు