రజినీ ట్రిపుల్ ధమాకా

రజినీ ట్రిపుల్ ధమాకా

‘కబాలి’గా నిరాశ పరిచాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అయినప్పటికీ ఆయన తర్వాతి సినిమా మీద అంచనాలేమీ తక్కువగా లేవు. ఎందుకంటే ఈసారి రజినీ సినిమా చేస్తోంది శంకర్‌తో. పైగా ‘రోబో’కు సీక్వెల్. అందులోనూ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా జనాలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజా సమచారం ప్రకారం ఈ సినిమాలో రజినీ మూడు రకాల అవతారాల్లో కనిపిస్తాడట.

రోబో తొలి భాగంలోనూ రజినీ మూడు అవతారాల్లో దర్శనమిస్తాడు. సైంటిస్టు వశీకరన్.. మంచి రోబో.. చెడ్డ రోబో. ఐతే ‘2.0’లో మూడు వేర్వేరు క్యారెక్టర్లు చేస్తున్నాడట రజినీ. వశీ.. చిట్టిలతో పాటు ఒక కొత్త రోబో కనిపిస్తుందట ఈ చిత్రంలో. ఆ రోబోను చిట్టికి డూప్‌గా విలన్ అయిన అక్షయ్ కుమార్ తయారు చేస్తాడట. ఈ రోబో విన్యాసాలు కళ్లు చెదిరేలా ఉంటాయని.. ఈ క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికి ‘2.0’ షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయింది. నవంబరు 20న దీని ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఐతే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు భారీగా చేయాల్సి ఉండటంతో వచ్చే ఏడాది ద్వితీయార్దంలోనే సినిమా రిలీజవుతుంది.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు