ఇది విన్నారా... 'కాష్మోరా'తో బిస్కెట్‌ వేసారంట!

ఇది విన్నారా... 'కాష్మోరా'తో బిస్కెట్‌ వేసారంట!

కార్తీ 'కాష్మోరా' చిత్రం ట్రెయిలర్‌ చూసి ఇది మరో 'బాహుబలి'లా ఉందే అంటూ జనం ఊగిపోతున్నారు. ఈ సినిమా ట్రెయిలర్‌కి యూట్యూబ్‌లో యాభై లక్షలకి పైగా వ్యూస్‌ వచ్చాయంటేనే ఇది ఎంతగా జనాల దృష్టిని ఆకర్షించిందనేది అర్థమవుతోంది. కాష్మోరా ట్రెయిలర్‌లో వార్‌ సెటప్‌, కార్తీ గుండు గెటప్‌, రాణిగా నయనతార లుక్‌ ఇవన్నీ అంచనాలని పెంచేసాయి. సినిమా మొత్తం బాహుబలి మాదిరిగా ఇదే సెటప్‌తో ఉంటుందని సినీ ప్రియులు ఫిక్స్‌ అయిపోయారు. ఈ శుక్రవారం విడుదలకి సిద్ధమవుతోన్న ఈ చిత్రం కోసం ఆబగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న రిపోర్ట్స్‌ బట్టి 'కాష్మోరా'లో ఆ పీరియడ్‌ సెటప్‌ కేవలం అరగంట మాత్రమే ఉంటుందని తెలిసింది. మిగతా సినిమా అంతా సగటు హారర్‌ కామెడీ మాదిరిగానే సాగుతుందట. ఆ అరగంటలోనే అంచనాలకి తగినంత ఎక్సయిట్‌మెంట్‌ అందిస్తే ఓకే కానీ లేదంటే ఇప్పుడు ఏర్పడ్డ అంచనాలకి ఈ కాష్మోరా తీవ్రంగా నిరాదరణకి గురయ్యే అవకాశాలున్నాయి.

హైప్‌ కోసం రాంగ్‌ ప్యాకేజింగ్‌ చేసిన చాలా చిత్రాలకి అలాంటి అనుభవాలే ఎదురైన నేపథ్యంలో విడుదలకి రెండు రోజులు ముందయినా తిమ్మిని బమ్మిని చేసి చూపించకుండా వున్నది వున్నట్టు చూపించడానికి నిర్మాతలు పూనుకోవాలి. లేదంటే రీసెంట్‌గానే కబాలి చిత్రానికి ఎలా చుక్కెదురైందో చూసాం కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English