ఆ సినిమాపై రాజమౌళికి ఎందుకంత ప్రేమంటే..?

ఆ సినిమాపై రాజమౌళికి ఎందుకంత ప్రేమంటే..?

రాజమౌళి ఓ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడాడంటే అది ఆ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రాజమౌళికి.. జనాల్లో ఓ క్రెడిబిలిటీ ఉంది. ఆయన మాటను అనుసరించేవాళ్లు.. నమ్మేవాళ్లు చాలా మంది ఉంటారు. అందుకే జక్కన్న తమ సినిమా చూడాలని.. పాజిటివ్‌గా ఓ ట్వీట్ పెట్టాలని చాలామంది కోరుకుంటారు. గత వారం ‘పెళ్లిచూపులు’ సినిమా చూసి రాజమౌళి ఇలాగే పాజిటివ్ ట్వీట్లు పెట్టాడు. అది ఆ సినిమాకు చాలా మేలు చేసింది. ఇక ఈ శుక్రవారం విడుదలైన ‘మనమంతా’ సినిమా గురించి కూడా చాలా పాజిటివ్‌గా స్పందించాడు రాజమౌళి.

ఐతే ఈ ట్వీట్లపై స్పందిస్తూ ఓ అభిమాని.. రాజమౌళికి ఓ ప్రశ్న సంధించాడు. ఇంతగా పనిగట్టుకుని ఈ సినిమాను పైకి లేపుతున్నారేంటి అని అడిగాడు. దానికి రాజమౌళి తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘‘దీనికి 25 శాతం కారణం నిర్మాత, దర్శకుడు. సాయికొర్రపాటి నాకు మంచి ఫ్రెండ్. చంద్రశేఖర్ యేలేటి నా బంధువు. ఐతే 75 శాతం ఓ మంచి సినిమా అందిరికీ చేరాలి. దానికి సపోర్టుండాలి అనే’’ అని బదులిచ్చాడు రాజమౌళి. మొత్తానికి ఈ ట్వీట్ ద్వారా రాజమౌళికి యేలేటి బంధువు అన్న సంగతి వెల్లడైంది. రాజమౌళి, యేలేటి దాదాపుగా ఒకేసారి కెరీర్ ఆరంభించారు. రాజమౌళి 2001లో దర్శకుడైతే.. యేలేటి రెండేళ్ల తర్వాత ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. రాజమౌళికి, యేలేటికి బంధుత్వం ఏంటో కానీ.. జక్కన్నకు బంధువే అయిన గుణ్ణం గంగరాజు దగ్గరే యేలేటి శిష్యరికం చేశాడు. ‘అమృతం’ సీరియల్లో కొన్ని ఎపిసోడ్లకు దర్శకత్వం వహించి.. ఆ తర్వాత ఆయన బేనర్లోనే ఐతే, అనుకోకుండా ఒక రోజు సినిమాలు తీశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English