Political News

జగన్ నడపలేరు, ఎన్నికలకు సిద్ధం కండి: చంద్రబాబు

ఏపీలో జన రంజక పాలన సాగుతోందని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న రోజుల్లోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం తమదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లుతోందని, ప్రజా సంక్షేమ పథకాలకు టీడీపీ అడ్డుపడుతోందని విమర్శిస్తున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం కావడం కల అని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి మరోసారి ఘోర పరాభవం తప్పదని …

Read More »

అంతర్మథనం.. వైసీపీలోకి ఎందుకొచ్చాం?

తామున్న పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వగానే.. ఆ పార్టీ నుంచి నేతలు అధికార పార్టీలోకి జంప్ చేయడం మామూలే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచాక ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వైకాపాలోకి నేతలు వలస వెళ్లారు. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేశారు. ఐతే గత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పదవికి రాజీనామా చేయకుండా తమ …

Read More »

జగన్ సర్కారును అయోమయంలో పడేసిన మద్యనిషేధం

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీల్లో మద్య నిషేధం అత్యంత ప్రధానమైంది. దేశవ్యాప్తంగా మద్యం ఏరులై పారుతున్న ఈ రోజుల్లో మద్య నిషేధం అమలు చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ మద్యం ద్వారా వచ్చే ఆదాయం మీద అతిగా ఆధారపడుతున్నాయి. సంక్షేమ పథకాలకు ఈ ఆదాయమే ఆయువుపట్టుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో …

Read More »

రష్యా వ్యాక్సిన్ ఫలితాలేంటి?

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వివిధ దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం కొన్ని నెలలుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్‌లు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. ఐతే వాటి కంటే ముందే రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని ప్రభుత్వ అనుమతులు కూడా పొందింది. దీన్ని ఇంకొన్ని రోజుల్లోనే మార్కెట్లోకి తేవాలనుకుంటున్నారు. ఈలోపు రెండు దశల్లో 76 మంది …

Read More »

సినిమా హీరోలా మారిన ఎస్పీ !

Prakasham SP Kaushal

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకాశం జిల్లాలోని ఇటీవల పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఆ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.. తమ డిపార్ట్‌మెంట్ సిబ్బందిపై కొరఢా ఝులిపిస్తున్న తీరు సంచలనం రేపుతోంది. పది రోజుల వ్యవధిలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ 50 మందికి పైగా సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం గమనార్హం. ఇవన్నీ అవినీతి వ్యవహారాల వల్ల జరిగిన సస్పెన్షన్లే కావడం విశేషం. ఒక జిల్లాలో పది రోజుల వ్యవధిలో …

Read More »

ఏపీ నేతలంతా అపోలోకు పొలోమంటున్నారే?

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకు 10 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది. తాజాగా గురువారం నాడు కూడా 10,199 పాజిటివ్ కేసులు రావడంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,65,730కి చేరుకుంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు….పల్లెల నుంచి పట్టణాల వరకు చాలామంది కరోనా బారిన పడుతున్నారు. అయితే, కరోనా బారిన పడిన సామాన్యులు ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా…రాజకీయ …

Read More »

కరోనా డెత్ రిపోర్ట్స్‌ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య నానాటికీ పెరిగిపోతోన్నసంగతి తెలిసిందే. తెలంగాణలో టెస్టుల సంఖ్య భారీగా పెంచాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నా…ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కరోనా టెస్టులు, గణాంకాల, నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు కూడా గతంలో హెచ్చరికలు జారీ చేసింది. అ యినప్పటికీ, తమ ఆదేశాలను అమలు చేయడం లేదని, కోర్టులంటే తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని హైకోర్టు గతంలో పలుమార్లు తీవ్ర …

Read More »

కర్ణాటకలో పట్టుబడ్డ నూతన్ నాయుడు…అరెస్ట్

విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరో ముండనం ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాత, నటుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిమానేసిన శ్రీకాంత్ ఫోన్ దొంగతనం చేశాడంటూ నూతన్ తో పాటు అతడి కుటుంబసభ్యులు శ్రీకాంత్ పై దాడి చేసి గుండు కొట్టించడం సంచలనం రేపింది. నూతన్ నాయుడు నివాసంలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ …

Read More »

ఆర్థిక మంత్రిపై భర్త గారి షాకింగ్ కామెంట్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు అన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ కీలక నేతల్లో ఒకరు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్‌ భార్యే నిర్మల. ప్రస్తుతం రైట్ ఫోలియో పేరుతో పొలిటికల్ అనాలసిస్, మార్కెట్ రీసెర్చ్ అనే కంపెనీ పెట్టుకుని దానికి ఎండీగా కొనసాగుతున్నారాయన. భార్య కేంద్ర మంత్రి అయినపుడు అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగానే ఆయన వైఖరి …

Read More »

మందుబాబులూ ఆంధ్రాలోనే కొనండ్రా !

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా మందుబాబుల కష్టాలు మామూలుగా లేవు. లాక్ డౌన్ కారణంగా మూతపబడ్డ మద్యం దుకాణాలు.. రెండు నెలల తర్వాత తెరుచుకున్నాయి కానీ.. అంతకుముందున్న పేరున్న బ్రాండ్లన్నీ తీసి అవతల పడేశారు. పైగా మద్యం రేట్లు విపరీతంగా పెంచి అమ్మడం మొదలుపెట్టారు. లాక్ డౌన్ వల్ల తలెత్తిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తాత్కాలికంగా మద్యం ధరలు పెంచారని.. మళ్లీ తగ్గిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. …

Read More »

ఆత్మహత్యకు అనుమతివ్వండి.. గవర్నర్‌కు కుటుంబం లేఖ

ఇదొక విచిత్రమైన వ్యవహారం. తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఒక కుటుంబం రాష్ట్ర గవర్నర్‌కు, హైకోర్టుకు లేఖలు రాసింది. తమ ఊరి వాళ్లే తమను వెలి వేయడమే ఇందుకు కారణం. ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లి కలెక్టరుతో విచారణ జరిపించే వరకు వ్యవహారం వెళ్లింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రకాశం జిల్లా …

Read More »

ఎన్నికల బరిలో రాములమ్మ

హీరోయిన్ టర్న్డ్ పొలిటీషియన్ విజయశాంతి మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దుబ్బాక అసెంబ్లీ స్థానంలో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఆ స్థానంలో బరిలో నిలవబోతున్నారు. ఐతే సానుభూతి కోణంలో ప్రధాన పార్టీలేవీ ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీ …

Read More »