ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారిన విషయం.. తోట త్రిమూర్తులు రాజకీయం! సీనియర్ నాయకుడిగా.. కాపు నేతగా.. ఫైర్ బ్రాండ్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన పేరుమోశారు. పార్టీలతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్‌ను కన్‌స్ట్రక్ట్ చేసుకున్న నాయకుల్లో తోట త్రిమూర్తులు ఒకరు. ఇది ఆయనకు మేలు చేసే పరిణా మమే అయినా.. తన దూకుడునే తనకు శత్రువుగా పెంచుకున్నారనే విమర్శలు కూడా …
Read More »టీడీపీకి నాన్ లోకల్ లీడరే దిక్కా ?
తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ బలహీనంగా ఉంది. ఇందుకు ఒకరకంగా నాయకత్వమే కారణమని చెప్పాలి. ప్రతి ఎన్నికకు ఓ అభ్యర్ధిని కొత్తగా తెరపైకి తెస్తోంది. అదికూడా ప్రధానంగా నాన్ లోకల్ నేతలను తీసుకొచ్చి తిరుపతి పార్టీపై రుద్దుతోంది. తాజాగా జరిగింది కూడా ఇదే. సోమవారం తిరుపతి లోక్ సభ పరిధిలోని పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడుతు రాబోయే లోక్ సభ ఉపఎన్నికల్లో పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా …
Read More »రఘునందన్ రావు.. పాత కేసు మళ్లీ వార్తల్లోకి
దుబ్బాక ఎన్నికల్లో సంచలన విజయం సాధించి జాతీయ స్థాయిలో వార్తల్లో వ్యక్తిగా మారాడు రఘునందన్ రావు. ఒకప్పుడు న్యాయవాది అయిన రఘునందన్.. టీవీ చర్చల్లో బీజేపీ ప్రతినిధిగా వెలుగులోకి వచ్చారు. మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. ఐతే కొన్నేళ్ల కిందట ఆయన ఓ రేప్ కేసు ఆయన్ని వివాదంలోకి నెట్టింది. రాజా రమణి అనే మహిళ.. తనపై రఘునందన్ అత్యాచారం చేసినట్లు సంచలన ఆరోపణలు చేసింది. ఐతే ఈ కేసు …
Read More »జీహెచ్ఎంసీ ఎన్నికలకు పవన్ సై
తెలంగాణలో ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ పోటీ చేయలేదు. తొలిసారిగా ఇక్కడ ఆ పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజుల కిందటే సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని …
Read More »ఏపీలో ఎన్నికలపై తేల్చేసిన నిమ్మగడ్డ
మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు గట్టి ప్రయత్నమే చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు. కానీ కరోనా అప్పుడు జనాలను భయకంపితుల్ని చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. దీనిపై వైకాపా నాయకులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో.. తదనంతరం నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి ఎలా యుద్ధం నడిచిందో తెలిసిందే. కాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ …
Read More »సిఎం పదవిని ఇచ్చి నితీష్ ను బీజేపీ బిగించేసిందా ?
బీహార్ రాజకీయాల్లో కొత్త తరహా రాజకీయం మొదలైంది. సంకీర్ణ ప్రభుత్వం పేరుతో, మిత్రధర్మం పేరుతో బీజేపీ నేతలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పూర్తిగా ఇరికించేసినట్లు అర్ధమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయుకి 43 సీట్లు, బీజేపీకి 73 సీట్లు వచ్చాయి. ఎన్డీయే కూటమిలోని మరో రెండు చిన్న పార్టీలకు కూడా కొన్ని సీట్లొచ్చాయి లేండి. ఇంత తక్కువ సీట్లలో గెలిచిన జేడీయు అధినేత నితీష్ నే …
Read More »తమిళనాడులో అళిగిరి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పెద్ద కొడుకు అళగిరి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతోందో ? అంటే అవుననే అంటోంది తమిళ మీడియా. 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీ పెట్టాలని అళగిరి డిసైడ్ చేసుకున్నట్లు ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. కరుణానిధి ఉన్నపట్టి నుండే పెద్దకొడుకు అళగిరికి చిన్న కొడుకు స్టాలిన్ కు పడదన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి తోడు కరుణానిధి తన …
Read More »ప్రభుత్వం-ఎన్నికల కమీషన్ మధ్య తాజా వివాదం
రాష్ట్రప్రభుత్వానికి, స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు మధ్య మళ్ళీ వివాదం తలెత్తింది. అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని కమీషన్ లాయర్ కు, ప్రభుత్వ లాయర్ కు మధ్య సుప్రింకోర్టులో పెద్ద వాగ్వాదమే జరిగింది. రెండు వైపుల వాదనలు విన్న తర్వాత అభివృద్ది పనులకు ఎలక్షన్ కమీషన్ అనుమతి తీసుకోవాల్సిందే అంటూ సుప్రింకోర్టు కూడా స్పష్టం చేయటంతో ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. ప్రభుత్వం అడిగినపుడు ఎలక్షన్ కమీషన్ అనుమతులు ఇవ్వకపోతే …
Read More »సంచైత నియామకంతో అశోక్ కు మరో షాక్ ఇచ్చిన ప్రభుత్వం
తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం. తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న104 ఆలయాలకు ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అశోక్ ప్లేసులో ఆయన అన్న కూతురు మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజును నియమించింది. గతంలో మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించిన ప్రభుత్వం సంచైతానే …
Read More »తిరుపతిలో బీజేపీ అప్పుడే ఎందుకు హడావుడి చేస్తోంది ?
తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ నేతల హడావుడి మొదలైపోయింది. అనూహ్యంగా తెలంగాణాలోని దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి రాష్ట్రంలో హడావుడి చేస్తోందంటే అర్ధముంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ గెలవటం అన్నది జాక్ పాట్ కొట్టినట్లే. ఇక్కడ గెలుస్తామని పైకి ఎన్ని ప్రకటనలు చేసినా లోలోపల మాత్ర కమలం నేతల్లో ఎవరికీ నమ్మకం లేదు. అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించేంత సీన్ నిజానికి బీజేపీకి లేదనే చెప్పాలి. …
Read More »గ్రేటర్ ఎన్నికలపై చంద్రబాబు వ్యూహం.. ఎవరికి నష్టం!!
మరో రెండు నెలల్లో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు .. ఈ ఎన్నికలపై రాష్ట్ర పార్టీ నేతలతో ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో ప్రభుత్వ వ్యతిరేక గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. కొన్నిరోజుల కిందట వచ్చిన తుఫాను కారణంగా భారీగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ పూర్తిగా మునిగిపోయింది. మనుషులుసైతం కొట్టుకుపోయి.. మృతి చెందారు. మనిషిలోతు …
Read More »ట్రంప్ నే తేజస్వి స్పూర్తిగా తీసుకున్నాడా ?
బీహార్లో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవ్ తృటిలో మిస్సయిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి సాధించిన ఓట్లకు మహాగఠబంధన్ (ఎంజీబీ)కు పోలైన ఓట్లకు మధ్య తేడా కేవలం 12500 మాత్రమే. ఇంత తక్కువ మార్జిన్లో ఓడిపోవటాన్ని ఆర్జేడీ చీఫ్ తేజస్వి తట్టుకోలేకపోతున్నట్లుంది. అందుకనే ఎన్డీయే కూటమి విజయంపై కోర్టులో కేసులు వేస్తానంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు తేజస్వీ తీవ్రంగా మండిపోతున్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates