ఏపీ మ‌ద్యం ద‌ర‌ఖాస్తుల్లో ఇంత మ‌త‌ల‌బు జ‌రిగిందా..!

తాజాగా ఏపీలో నూత‌న‌ మ‌ద్యం పాల‌సీకి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ముగిసింది. ఆశించిన దానికంటే.. 10 శాతం త‌క్కువ‌గానే ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. నిజానికి ఈ మ‌ద్యం పాల‌సీతో..ద‌ర‌ఖాస్తుల రూపంలోనే స‌ర్కారు 2500 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే నిధులు స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించింది. అందుకే.. గ‌తంలో లేని విధంగా ద‌ర‌ఖాస్తు ఫీజును రూ.200000గా నిర్ణ‌యించింది. దీనిని దుకాణం పెట్టుకునే అవ‌కాశం వ‌చ్చినా.. రాకున్నా.. తిరిగి చెల్లించ‌రు.

ఇలా..మొత్తం ల‌క్ష‌కు పైగానే ద‌ర‌ఖాస్తులు వ‌స్తాయ‌ని లెక్క‌గ‌ట్టుకున్నారు. కానీ, 89 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చా యి. స‌రే.. ఆశించిన దానికంటే కొంత వ‌ర‌కు బాగానే ఉంద‌ని అంటున్నారు. ఇది ఎలా ఉన్నా.. ఎవ‌రూ త‌క్కువ కారు.. త‌క్క‌వుగా లేరు! అని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు మ‌ద్యందుకాణాల ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రి యకు సంబంధించి చేస్తున్న కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. స‌హ‌జంగా మ‌ద్యం వ్యాపారం అంటేనే రాజ‌కీయ నేత‌ల‌కు పాడికుండ‌. దీంతో వ‌చ్చిన అవ‌కాశంఎందుకు వ‌దులుకుంటారు?

ఇదే ఇప్పుడు జ‌రిగింది. ద‌ర‌ఖాస్తుల ప్రక్రియ నుంచే నాయ‌కులు జోక్యం చేసుకున్నారు. ద‌ర‌ఖాస్తు దారుల‌ను క‌ట్ట‌డి చేశారు. ఎక్క‌వ‌గా పోటీ ప‌డితే.. రేపు లాట‌రీలో త‌మ పేరు వ‌స్తుందో రాదో అనే బెంగ కొంత‌మందిని వెంటాడింది. దీంతో వారంతా.. ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ నాయ‌కులు మాత్రమే జాగ్ర‌త్త ప‌డ్డార‌ని అనుకుంటే పొర‌పాటే. తొలిసారి జెండా ప‌ట్టుకున్న‌వారు.. తొలిసారి గెలిచిన వారు కూడా.. జోక్యం చేసుకుని.. బాగానే పోగేసుకున్నార‌న్న‌ది టాక్‌.

నీకిది-నాక‌ది త‌ర‌హాలో ముక్కు మాత్ర‌మే కాదు.. చెవులు కూడా పిండేసి.. ఒప్పందాలు చేసేసుకున్నార న్న‌ది టీడీపీలోనే వినిపిస్తున్న మాట‌. నెల‌కు 25 % క‌మీష‌న్‌, ఆరు మాసాల‌కు ముడుపులు, అతిథులు (పెద్ద‌నేత‌లు) నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌స్తే.. పూర్తి ఖ‌ర్చు.. ఇలా కీల‌క నాయ‌కులు లెక్క‌లు వేసుకుని ముందుగా నే ద‌ర‌ఖాస్తు దారుల‌తో లిఖిత పూర్వ‌క ఒప్పందాలు చేసుకున్నారు. ఈ విష‌యంలో టీడీపీ అనుకూల మీడియాకే తెలిసిపోయిందంటే.. ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు.. అనంత‌పురంలో అయితే.. మ‌హిళా నాయ‌కులే.. చ‌క్క బెట్టేశారంటే ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో తెలుస్తుంది.