లైవ్ పేరుతో దొరికిపోయిన జ‌గ‌న్‌

Jagan
AP CM YS Jagan Pressmeet

క‌రోనా మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌తంలో పెట్టిన ప్రెస్ మీట్లు ఎంత‌గా ఆయ‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయో తెలిసిందే. క‌రోనా గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఆయ‌న చేసిన కామెంట్లు విమ‌ర్శ‌ల పాల‌య్యాయి. అవి చాల‌వ‌న్న‌ట్లు క‌రోనా పుట్టింది కొరియాలో అంటూ త‌న అవ‌గాహ‌న లేమిని చాటుకున్నాడు. ఈ విష‌యాల్లో మీడియాను ఫేస్ చేయ‌డం ఆయ‌న‌కు చాలా క‌ష్ట‌మైంది.

ప్రెస్ మీట్ పెట్టిన ప్ర‌తిసారీ సోష‌ల్ మీడియాలో జ‌నాలు త‌న‌ను ఆడేసుకుంటుండ‌టంతో రూటు మార్చి రికార్డెడ్ వీడియోలు ప్రెస్‌కు రిలీజ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు జ‌గ‌న్. ఐతే తాజాగా సోమ‌వారం మ‌ధ్యే మార్గంగా.. ప్రెస్ లేకుండా నేరుగా లైవ్‌లో మీడియాకు మెసేజ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు జ‌గ‌న్. సాక్షి, టీవీ9 లాంటి ఛానెళ్లు ఏపీ సీఎం ప్ర‌జ‌ల‌నుద్దేశించి లైవ్‌లో మాట్లాడుతున్న‌ట్లు ఫీడ్ మొద‌లు పెట్టాయి.

ఐతే పేరుకే ఇది లైవ్ అని.. ఇది కూడా ఇంత‌కుముందు లాంటి రికార్డెడ్ వీడియోనే అనే విష‌యాన్ని సోష‌ల్ మీడియా జ‌నాలు బ‌య‌ట‌పెట్టేశారు. కొన్ని చోట్ల జ‌గ‌న్ వాయిస్ జంప్ కావ‌డం.. దృశ్యంలో మార్పు రావ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది. అది చాల‌ద‌న్న‌ట్లు లైవ్ వీడియోలో జ‌గ‌న్ ఒక్కో చోట ఒక్కో ర‌క‌మైన టైమ్ చూపించ‌డంతో ఇది లైవ్ కాద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలిసిపోయింది.

ఒక చోట ఒంటి గంట కావ‌స్తున్న‌ట్లు టైం చూపించ‌గా.. ఇంకో చోట ఏకంగా స‌మ‌యం ఐదు గంట‌లు దాటిపోయింది. దీంతో జ‌గ‌న్ మ‌ధ్య మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకుని.. బాగా ప్రాక్టీస్ చేసి.. టేక్‌ల మీద టేక్‌లు తీసుకుని తాపీగా ఈ మెసేజ్ ఇచ్చాడ‌ని.. కానీ చివ‌రికిది లైవ్ అని భ్ర‌మింప‌జేసే ప్ర‌య‌త్నం టీవీ ఛానెళ్లు చేశాయ‌ని స్ప‌ష్టంగా తెలిసిపోయింది. దీనిపై వైకాపా వ‌ర్గాలు ఎలా డిఫెండ్ చేసుకుంటాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రం.