ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టై ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా ప్రధాని మోడీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను చెప్పిన పని మోడీ చేస్తే బీజేపీ తరఫున తాను ప్రచారం చేస్తానని క్రేజీ ఆఫర్ ఇచ్చారు కేజ్రీవాల్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని సవాల్ విసిరారు కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్ ఇవ్వాలని షరతు పెట్టారు. ఢిల్లీలోని ఆప్ సర్కార్ 200 యూనిట్లులోపు విద్యుత్ వినియోగించేవారికి ఉచితంగా విద్యుత్ అందజేస్తోన్న సంగతి తెలిసిందే.
ఢిల్లీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, లెఫ్లినెంట్ గవర్నర్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే డబుల్ లూట్ అని, యూపీలో ఏడేళ్లుగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శఇంచారు. ప్రధాని మోడీ పదేళ్ల పాలనపై కేజ్రీవాల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు.
పదేళ్లలో బీజేపీ పాలకులు ఏమీ చేయలేదని, ఏమీ చేయలేదు. ప్రధాని మోడీకి 2025 నాటికి 75 ఏళ్లు నిండుతాయని, అప్పటికైనా ప్రజలకు ఏమైనా చేయాలని హితవు పలికారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని కేజ్రీవాల్ ఆరోపించారు.
హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలకు ప్రజలకు చరమగీతం పాడతారని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వాలకు ఎదురుగాలి వీస్తుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు సగానికి తగ్గాయని, హర్యానా, మణిపూర్‌లో 7 సంవత్సరాల పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నా ఉపయోగం లేదని, రెండేళ్లుగా మణిపూర్ మండుతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు.
This post was last modified on October 6, 2024 8:33 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…