Political News

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న పార్టీ పేరును `తెలంగాణ ప్ర‌జా జాగృతి`గా నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె పార్టీ పేరును నిర్ణ‌యించార‌ని.. ఈ మేర‌కు ఆమె కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్టు స‌మాచారం. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిని పెండింగులో పెట్టింద‌ని తెలిసింది.

తెలంగాణ జాగృతి సంస్థ త‌రఫున క‌విత అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. దీనికి అధ్య‌క్షురాలుగా కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో జాగృతి త‌ర‌ఫున మ‌రింత ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మైన ఈ సంస్థ పేరునే ఆమె ఖ‌రారు చేసుకోవ‌డం ద్వారా మ‌రింత పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. కాగా.. తండ్రితో విభేదించి.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వచ్చిన క‌విత‌.. సొంత అజెండాతో పార్టీని ఏర్పాటు చేసుకుంటామ‌న్నారు. ఈ ఏడాది ద‌స‌రా నాటికి పార్టీని ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

న్యాయ వివాదాలు..

మ‌రోవైపు.. క‌విత పార్టీపై న్యాయ‌వివాదాలు ముసురుకున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆమె స‌మ‌ర్పించిన ద‌ర‌ఖాస్తులో కొన్ని లోపాల‌ను గుర్తించి.. వాటిని స‌రిచేయాల‌ని సూచించారు. అయితే.. తాను స‌రిగానే ద‌ర‌ఖాస్తు చేశాన‌ని క‌విత చెబుతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 29ఎ కింద రాజకీయ పార్టీ నమోదు కోసం చేసిన తన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం త్వ‌ర‌గా పరిశీలించేలా చూడాల‌ని కోరుతూ.. ఆమె ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

అయితే.. ఇది ఉద్దేశ పూర్వంగా చేస్తున్న ఆరోప‌ణేన‌ని.. అన్ని పార్టీలు స‌మ‌ర్పించిన ద‌ర‌ఖాస్తు మాదిరిగానే తాను కూడా ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న‌ట్టు క‌విత చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కోర్టు జోక్యాన్ని కోరారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మాధానం కోరింది. దీనిపై ఎన్నిక‌ల సంఘం ఇచ్చే స‌మాధానం.. క‌విత చేసే ఆర్గ్యుమెంట్ల ఆధారంగా గుర్తింపుతో పాటు.. పార్టీ పేరును కూడా నిర్ధారించ‌నున్నారు.

This post was last modified on March 19, 2026 5:04 pm

Share

Recent Posts

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

46 minutes ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

2 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

5 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

5 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

7 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

9 hours ago