Movie News

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఆ ఊ అంటూ కాపీ రైట్ కేసులు ప‌డిపోతున్నాయి. ఒరిజిన‌ల్ క్రియేట‌ర్స్ మ‌నోభావాలు కూడా దెబ్బ తింటున్నాయి. అనుమ‌తులు అడ‌గాలి. డ‌బ్బులు క‌ట్టాలి. ముఖ్యంగా ఇళ‌య‌రాజా కేసుల పుణ్య‌మా అని భారీగా ఖ‌ర్చు పెట్టి మ‌రీ పాత పాట‌ల రైట్స్ తీసుకుంటున్నారు. లేదంటే ఆ పాట‌ల జోలికే వెళ్ల‌డం మానేస్తున్నారు.

రాజాసాబ్ సినిమాలో హిందీ పాట‌ నాచే నాచేను రీమిక్స్ చేయ‌డం కోసం కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి. ఇళ‌య‌రాజా పాట‌ల‌ను జ‌స్ట్ అలా బ్యాగ్రౌండ్లో వాడినా స‌రే ఆయ‌న ఊరుకోవ‌ట్లేదు. చాలా సినిమాల మేక‌ర్స్ ముందే డ‌బ్బులు చెల్లించి రైట్స్ తీసుకున్నారు. లేదంటే త‌ర్వాత కేసుల పుణ్య‌మా అని జ‌రిమానాలు క‌ట్టారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలో పాత పాట‌లు చాలానే వాడుకున్న నేప‌థ్యంలో నిర్మాత‌లు వాటి కోసం ఎంత ఖ‌ర్చు పెట్టారో అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.

ప‌వ‌న్ సినిమానే అయిన తొలిప్రేమ నుంచి ఈ మ‌న‌స్సే పాట‌ను పూర్తిగా ఉస్తాద్ కోసం వాడేశారు. పాత పాట‌ను పెట్టేసి కొత్త విజువ‌ల్స్ జోడించారు. ఈ పాట బీజీఎంను సైతం కొన్ని చోట్ల వాడారు. మ‌రోవైపు రుద్ర‌వీణ‌లోని ఇళ‌య‌రాజా పాట త‌ర‌లిరాద తనే వ‌సంతంను కూడా సినిమా కోసం వాడుకున్నారు. ఇక నాటు నాటు.. కుర్చీ మ‌డ‌త‌పెట్టి.. ఇలా ప‌లు పాట‌ల‌తో ఒక మెడ్లీ లాంటి ఎపిసోడ్ కూడా ఉంది ఇందులో.

మ‌రి ఇన్ని పాట‌లు వాడిన‌పుడు ఆయా చిత్రాల మేక‌ర్స్ నుంచి అనుమ‌తులు తీసుకున్నారా.. డ‌బ్బులు క‌ట్టారా అన్న‌ది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా త‌న పాట‌ను అనుమ‌తి లేకుండా, డ‌బ్బులు క‌ట్ట‌కుండా వాడుకుంటే ఇళ‌య‌రాజా ఊరుకుంటారా అన్న‌ది డౌటు. మైత్రీ సంస్థే నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో త‌న పాట‌ను వాడారాని చాలా సీరియ‌స్ అయి నోటీసులు పంపారు ఇళ‌య‌రాజా.

ఐతే ఇటీవ‌ల కోర్టులో ఈ కాపీ రైట్ వివాదానికి సంబంధించి ఆయ‌న‌కూ గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. కాబ‌ట్టి ఆయ‌న దూకుడు త‌గ్గించి ఉండొచ్చు. అయినా స‌రే మైత్రీ సంస్థ‌కు ఇంత‌కుముందు ఎదురైన అనుభ‌వం దృష్ట్యా ముందు వెనుక ఆలోచించ‌కుండా ఈ పాటను వాడుకుని ఉండ‌రు.

This post was last modified on March 19, 2026 8:29 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

1 hour ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

4 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

4 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

4 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

4 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

5 hours ago