ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా ఆమె సినిమాలు బాగా తగ్గించేసింది. వ్యక్తిగత జీవితంలో అనేక పరిణామాలు.. అనారోగ్యం.. వయసు పెరిగి గ్లామర్ తగ్గడం.. ఇలా రకరకాల కారణాలతో ఆమెకు సినిమాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పటికీ సమంతకు తెలుగు, తమిళ భాసల్లో మంచి ఫ్యాన్ బేస్, మార్కెట్ ఉన్న మాట వాస్తవం.
ఆమెను ఫుల్ లెంత్ రోల్స్‌లో చూడాలనుకునే ప్రేక్షకుల పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారి కోసమే మళ్లీ లీడ్ రోల్‌లో మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది సమంత. ఆమెతో ఓ బేబీ లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. గత ఏడాది రిలీజైన ఈ సినిమా టీజర్ సమంత అభిమానులను బాగానే ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఇంకో రెండు నెలల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మళ్లీ ప్రమోషన్లలను రీస్టార్ట్ చేసింది చిత్ర బృందం.
ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ.. సమంత, నందిని రెడ్డి, సుమ కలిసి ఒక వీడియో ప్రోమో చేశారు. వీడియో కాల్ ద్వారా వారితో సమంత భర్త, మా ఇంటి బంగారం నిర్మాతల్లో కూడా ఒకడైన రాజ్ నిడిమోరు కలిశాడు. అందరూ సరదాగా ముచ్చట్లు పెట్టారు. రాజ్, సమంత జంట సరదాగా మాట్లాడుకోవడమే ఈ వీడియోలో హైలైట్.
రాజ్ తెలుగువాడే అన్న సంగతి తెలిసిందే. అతడి సొంతూరు తిరుపతి. అతను తెలుగులో చక్కగా తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పడం గురించి నందిని ప్రస్తావిస్తే.. తనది తిరుపతే అన్న విషయాన్ని సమంత గుర్తు చేసింది. ఈ వీడియో చూశాక.. రిలీజ్ టైంకి రాజ్ మరింతగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.
దర్శకుడిగా రాజ్‌కు పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరుంది. ఇక సమంతతో అతడి బంధం పట్ల అందరికీ అమితాసక్తి ఉంది. మళ్లీ సామ్ ఇలా వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం, సంతోషంగా కనిపిస్తుండడం అభిమానులకు కూడాడ ఆనందాన్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి రిలీజ్ టైంలో మా ఇంటి బంగారం మూవీని ప్రమోట్ చేస్తే మంచి మైలేజీ వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on March 19, 2026 6:11 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…