వైసీపీ అధినేత జగన్ తాజాగా శనివారం రాత్రి 9 గంటల సమయంలో విజయవాడ వరదల విషయంపై సుదీర్ఘ పోస్టు చేశారు. మొత్తం 8 అంశాలతో ఆయన చంద్రబాబు సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వరదలు వచ్చి 8 రోజులు అయిపోయినా బాధితుల ఆకలి కేకలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ప్రభుత్వ యంత్రాంగం ఏమైపోయిందని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని కూడా ప్రశ్నించారు. మొత్తానికి ఈ పోస్టు చాలా వేగంగా వైరల్ అయింది.
దీనిపై మెజారిటీ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు.. జగన్ బెస్ట్! అని కీర్తించారు. విమర్శల విషయానికి వస్తే.. ఆకలి కేకలు వినిపిస్తే.. మీరు ఏం చేస్తున్నారని ఎక్కువ మంది ఎదురు ప్రశ్న వేశారు. మరికొందరు ఇప్పటికే చంద్రబాబు బురద, వరదలో దిగి తిరుగుతున్నారు. బాధితులను ఆదుకుంటు న్నారు.. ఇవేవీ మీకు కనిపించడం లేదా? అని నిగ్గదీశారు. పేదల పక్షపాతి.. పెత్తందారుల సాయం కోసం ఎదురు చూడకుండా.. మీరే దిగిపోవచ్చు కదారంగంలోకి
అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఇది రాజకీయ ఆట కాదు.. ప్రజా జీవితం
అంటూ మరికొందరు స్పందించారు. ఈ విమర్శల సుడిగుం డంలో పడి జగన్ పోస్టు భారీగా ఎదురీత ఎదుర్కొంది. ఇక, సినీ క్యారెక్టర్ నటుడు బ్రాహ్మాజీ మరో విధంగా జగన్‌కు చురకలు అంటించారు. అయితే.. ఆయన వ్యాఖ్యల్లో వ్యంగ్యం ఎక్కువగా కనిపించడం గమనా ర్హం. “మీరు చెప్పింది(చంద్రబాబు ప్రభుత్వం ఉందా లేదా? యంత్రాంగం ఏమైపోయింది) కరెక్ట్ సర్! అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. వాళ్లు(ప్రభుత్వం) చేయలేరు. ఇక నుంచి మనం చేద్దాం. వెంటనే మనం వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేద్దాం. మన వైసీపీ కేడర్ మొత్తాన్నీ రంగంలోకి దించుదాం. మనకు జనాలు ముఖ్యం. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్. జై జగనన్న!
అని బ్రహ్మాజీ కామెంట్ చేశారు. అయితే.. జగన్ వ్యాఖ్యలను సమర్థించిన వారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వరదల్లో చిక్కుకున్న వారి వీడియోలు..సాయం అందరికీ అందించలేక పోతున్నాం.. అధికారులు సరిగి పనిచేయడం లేదు
అని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియోలను మరికొందరు జగన్ ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.
బ్రహ్మాజీ ఎక్స్ హ్యాక్
జగన్ పోస్టుకు కామెంట్ చేసిన బ్రహ్మాజీ ఎక్స్
హ్యాండిల్ హ్యాకైంది. దీంతో ఆయన తన పోస్టును డిలీట్ చేశారు.