ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ భేటీ ప్రారంభైంది. దీనిని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించారు. అయితే.. ఈ సమావేశంలో ప్రధాని మోడీని గట్టిగా నిలదీయాలన్న లక్ష్యంతో వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. అనూహ్యంలోనే సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. దీనిపై అందరూ విస్మయం చేశారు. అయితే.. ప్రధాని మోడీ మాత్రం మౌనంగా ఉన్నారు.
ఏం జరిగింది?
వికసిత భారత్-2047 థీమ్‌తో నిర్వహించిన నీతి ఆయోగ్ భేటీలో ముందు ప్రదాని మాట్లాడారు. తర్వాత.. అక్షర క్రమంలో తొలి రాష్ట్రమైన ఏపీకిఅవకాశం వచ్చింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం, తర్వాత.. అస్సాం.. ఆ తర్వాత.. బెంగాల్ సీఎం మమతకు అవకాశం లభించింది. అప్పటి వరకు మాట్లాడిన సీఎంలు .. వారివారి సమస్యలను వికసిత భారత్ లక్ష్యాలను ఎలా ముందుకు తీసుకువెళ్లేదీ కూడా వివరించారు.
అయితే.. మమత వంతు వచ్చే సరికి.. ఆమె ప్రస్తుతం ఉన్న నీతిఆయోగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదేసమయంలో గత ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని కూడా డిమాండ్ చేశారు. ఇక, బెంగాల్ విభజనకు జరుగుతున్న కుట్రను కేంద్రం ఆపాలన్నారు. ఇలా ఆమె అజెండాలో లేని అంశాలను ప్రస్తావించడంతో వెంటనే మైక్ కట్ చేశారు. దీంతో మమత ఆగ్రహోదగ్రురాలయ్యారు. చివాల్న సీటులోంచి లేచి.. బయటకు వచ్చేశారు.
చంద్రబాబుకు 20 నిమిషాల సేపు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని.. తను ప్రసంగం ప్రారంభించగానే మైకు కట్ చేశారని.. మమత విమర్శించారు. నీతి ఆయోగ్ అంటే.. మోడీ నీతులు వినేందుకు రావడమేనని.. ఎద్దేవా చేశారు. తమకు అవకాశం లేదని.. తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇవ్వరని వ్యాఖ్యానించారు. అందుకే నిరసనగా తాను సమావేశాన్ని బాయ్ కాట్ చేశానని ఆమె వివరించారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జయలలిత కూడా.. ఇదేవిధంగా నీతి ఆయోగ్ సమావేశం నుంచి బయటకు వచ్చి మోడీని తిట్టిపోసిన విషయం తెలిసిందే. తర్వాత ఆమె అవినీతి కేసులు జోరందుకోవడం.. జైలుకు వెళ్లడం.. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి అనారోగ్యంతో కన్నుమూయడం తెలిసిందే.