ఏపీలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేపుతున్నది.
‘నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భం దాల్చిందని, నా భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే భర్త మదన్ మోహన్ ఫిర్యాదులో అనుమానానం వ్యక్తం చేశాడు.
నా భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలి అంటూ మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ ను కోరాడు. అయితే ఇటీవలే శాంతిని సస్పెండ్ చేసిన దేవదాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేసిన నేపథ్యంలో దేవదాయ శాఖలో శాంతి భర్త చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
అసిస్టెంట్ కమీషనర్ శాంతి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని గతంలో మూకుమ్మడి సెలవుపెట్టి నిరసన తెలపడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని నోటీసులు జారీచేసింది. ఒకసారి ఉన్నతాధికారి మీద ఇసుకపల్లి వివాదంలో చిక్కుతున్న చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో శాంతి భర్త ఆమెపై ఫిర్యాదు చేయడం, అందులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు పెట్టడం సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates