మోడీదే అధికారం.. కానీ.. తారుమారైన అంచ‌నాలు!

పోలింగ్ జ‌రుగుతున్న‌ స‌మ‌యంలో పార్టీల బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేయ‌డం.. ఎవ‌రు గెలుస్తున్నారు? ఎవ‌రు ఓడుతున్నార‌నే విష‌యాల‌ను చెప్ప‌డం వంటివి కూడా.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను, ఓట‌ర్ల‌ను కూడా ప్ర‌భావితం చేసిన‌ట్టుగానే భావించాల్సి ఉంటుంది. అందుకే.. ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభానికి ముందు 48 గంట‌ల్లో ఎవరూ అలాంటి ప‌నులు చేయ‌రాద‌ని సూచ‌న‌లు కూడా ఉన్నాయి. అయినా కూడా ఎవ‌రూ ఆగ‌డం లేదు.

ప్ర‌ధాని మోడీ వంటివారే.. ఏదోఒక రూపంలో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌నే చ‌ర్చ ఉంది. ఒక‌వైపు పోలింగ్ జ‌రుగుతుండ‌గానే.. మోడీ ఏదో ఒక రూపంలో మీడియాలో క‌నిపిస్తూనే ఉన్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తూనే ఉన్నారు. తాజాగా శ‌నివారం ఆరోద‌శ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతున్న క్ర‌మంలోనూ ఇలానే ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సెఫాల‌జిస్ట్ యోగేంద్ర యాద‌వ్‌.. తాజాగా కేంద్రంలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు.

కేంద్రంలో ఈ సారి కూడా మోడీనే అధికారంలోకి వ‌స్తార‌ని.. యాద‌వ్ తేల్చి చెప్పారు. ఇదే విష‌యాన్ని ఇప్పటి వ‌ర‌కు చాలామంది చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. వార కంటే మ‌రింత కీన్ అబ్జ‌ర్వేష‌న్‌తో యాద‌వ్ ఆయా వివ‌రాలు వెల్లడించ‌డం విశేషం. ఈయ‌న చెప్పిన మేర‌కు బీజేపీనే మ‌రోసారి అధికారంలో కి వ‌స్తుంది. కానీ, సీట్లు త‌గ్గుతాయ‌ని చెప్పారు. చిత్రం ఏంటంటే.. ఒక‌వైపు మోడీ ప‌రివారం అంతా త‌మ‌కు 400 సీట్లు రావాల‌ని.. ఇవ్వాల‌ని కోరుతున్నారు.

కానీ ఎవ‌రు చెప్పినా.. అన్ని సీట్లు మాత్రం రావ‌ని అంటున్నారు. 240-260 సీట్లు బీజేపీకి ఒంట‌రిగా వ‌స్తాయని అంటున్నారు. మిత్ర‌ప‌క్షాల‌కు మ‌రో 30-40 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. చెబుతున్నారు. మొత్తంగా మోడీ అయితే.. ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక‌, కాంగ్రెస్ ప‌రిస్థితి చూస్తే.. ఈ సారి 150 వ‌ర‌కు సొంతంగానే సీట్లు తెచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అయితే.. అధికారం మాత్రం ఈసారి కూడా అంద‌ని ద్రాక్షేన‌న్న‌ది వీరి మాట‌. సో.. ఎలా చూసుకున్నా.. మోడీనే మ‌రోసారి వ‌స్తున్నా ఆయ‌న చెబుతున్న‌ట్టు 400 సీట్లు అయితే ద‌క్క‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు.