చీపురుపల్లి అంటే తమ అడ్డా.. ఇక్కడ తనను ఓడించేది ఎవరంటూ ఇన్ని రోజులు ధీమాగా ఉన్న వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. నియోకవర్గంలో మారుతున్న సమీకరణాలు చూసి ఆందోళన చెందుతున్నారు. గెలుపు దక్కించుకోవాలనే ఆరాటంతో ఇల్లు దాటి బయటకు వస్తున్నారు. అందుకు కారణం టీడీపీ తరపున పోటీ చేస్తున్న కళా వెంకట్రావు. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. కళా వెంకట్రావు దెబ్బకు బొత్సకు భంగపాటు తప్పదని చర్చించుకుంటున్నారు.
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బొత్సకు కంచుకోటగా ఉంది. ఇక్కడ నాలుగు సార్లు పోటీ చేస్తే ఆయన మూడు సార్లు గెలిచారు. ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడల్లా మంత్రి అయ్యారు. ఇప్పుడు వరుసగా అయిదో సారి పోటీ చేస్తున్న ఆయన విజయంపై ఇన్ని రోజులూ ధీమాతోనే ఉన్నారు. కానీ శ్రీకాకుళం నుంచి చీపురుపల్లికి వచ్చిన టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు దెబ్బకు బొత్సకు గుబులు పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. తన రాజకీయ చాతుర్యంతో ఈ నియోజకవర్గంలో టీడీపీని గెలిపించేందుకు కళా దూసుకెళ్తున్నారని తెలిసింది.
టీడీపీ నేతల్లోని అసంతృప్తిని చల్లార్చిన కళా.. ఇక వైసీపీలోని కీలక నాయకులకు గాలం వేసి విజయవంతమవుతున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులను టీడీపీలోకి మరల్చి ఇక్కడ పట్టు సాధిస్తున్నారు. వైసీపీకి తిరుగులేని మొరకముడిదాం లాంటి మండలాల్లోనూ టీడీపీని బలోపేతం చేస్తూ కళా సాగుతున్నారు. నియోజకవర్గంలో గడప గడపకు వెళ్తూ జనాల ఆదరణ సంపాదిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ ఆరాచకాలను ఎండగడుతున్నారు. అధికారంలో ఉండి బొత్స చేసేందేమీ లేదని మండిపడుతున్నారు. దీంతో పదేళ్ల తర్వాత చీపురుపల్లిలో టీడీపీ జెండా ఎగురుతుందని పార్టీ వర్గాలు ఆశపడుతున్నాయి. మరోవైపు ఇన్ని రోజులూ మెజారిటీ లెక్కలేసుకున్న బొత్స.. ఇప్పుడు గెలుపు కోసం కష్టపడుతున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates