తమ రాష్ట్రం కాదు తమ పార్టీ కూడా కాదు.. కానీ తన అవసరాల కోసం జగన్ పిలిచి మరీ వాళ్లకు పదవులు కట్టబెట్టారు. తీరా ఇప్పుడు ఏపీ ఎన్నికల సమయంలో వాళ్లు కనీసం జగన్ ముఖం కూడా చూడటం లేదు. ప్రచారం సంగతి పక్కన పెడితే కనీసం జగన్ను కూడా వాళ్లు పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. జగన్ ఏరికోరి పదవులు ఇచ్చిన వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు పత్తాలేకుండా పోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బయటి వాళ్లు అసలు కనిపించడం లేదనే చెప్పాలి.
తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యను పిలిచి మరీ జగన్ రాజ్యసభకు పంపారు. ఏపీలో బీసీ నేతలే లేనట్లు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందనే ఉద్దేశంతో కృష్ణయ్యకు జై కొట్టారు. కానీ ఇప్పుడు కృష్ణయ్య ఎక్కడా అని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నారు. అయినా జగన్ సైలెంట్‌గానే ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కృష్ణయ్య కాంగ్రెస్ పక్షాన నిలిచారు. అయినా జగన్ మౌనమే దాల్చారు. కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ అయినా జగన్‌కు కృష్ణయ్య అండగా ఉంటారని వైసీపీ నాయకులు అనుకుంటే నిరాశే ఎదురవుతోంది.
మరోవైపు రిలయన్స్‌కు చెందిన ఓ పెద్ద మనిషి పరిమళ్ నత్వానీ, సుప్రీం కోర్టు లాయర్ నిరంజన్ రెడ్డికి జగన్ రాజ్యసభ పదవులు ఇచ్చారు. కానీ వీళ్లు కూడా ఇప్పుడు జగన్‌కు దూరంగానే ఉంటున్నారు. ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా సోషల్ మీడియాలోనైనా జగన్‌కు ఓటు వేయాలని కూడా అడగడం లేదు. పైగా పరిమళ్ వస్తే వైఎస్‌ను హత్య చేయించింది రిలయన్సే అని గతంలో జగన్ దొండ ఏడుపులు ఎక్కడ బయటకు వస్తాయోనని వైసీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇన తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డికి జగన్ కేసుల్లో వాదనలకే సమయం సరిపోవడం లేదంటా. ఇక ప్రచారం ఎప్పుడు చేస్తారు? మొత్తానికి జగన్ ఓటమి పాలవుతారని వీళ్లకు ఓ అంచనా ఉండటంతోనే ప్రచారానికి రావడం లేదని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates